Pages

Showing posts with label homoeo. Show all posts
Showing posts with label homoeo. Show all posts

Arthritis - కీళ్ళవ్యాధులు

కీళ్ళవ్యాధులు - Arthritis

కీళ్ళవ్యాధులు  (Arthritis) శాశ్వత విముక్తి
కీళ్ళు శరీర కదలికలకు ఉపయోగపడతాయి. కీళ్ళవ్యాధులు చాలా రకాలు ఉంటాయి.

 వీటిలో ముఖ్యమైనవి 
 ఆస్టియో ఆర్థరైటిస్
 రుమటాయిడ్ ఆర్థరైటిస్
 ఆస్టియో ఆర్థరైటిస్: కీళ్ళలో అరుగుదల మూలంగా వచ్చే వ్యాధిని ఆస్టియో ఆర్థరైటిస్ అంటారు. ఇది ఎక్కువగా మోకాలి కీళ్ళలో కనిపిస్తుంది.

 కారణాలు:
అధికబరువు, నలైభైఏళ్ళు దాటినవారు, వంశపారంపర్యంగా తల్లిదండ్రుల నుంచి పిల్లలకు సంక్రమించే అవకాశం ఉంది. కీళ్ళపై దెబ్బ తగలడం, కీళ్ళను ఎక్కువగా ఉపయోగించడం, మెటబాలిక్ సంబంధించిన వ్యాధులు కలవారిలో (హీమోక్రోమటాసిస్, విల్సన్‌వ్యాధి), రుమటాయిడ్ ఆర్థరైటిస్ కలవారిలో, డయాబెటిస్, థైరాయిడ్ సమస్యలు ఉన్నవారిలో వచ్చే అవకాశాలు ఎక్కువ.

 లక్షణాలు:
కీళ్ళలో నొప్పి... కదలికల వలన ఎక్కువగా ఉండటం, స్టిఫ్‌నెస్ కలిగి ఉండటం, కీళ్ళలో కదలికలు జరిగినప్పుడు శబ్దాలు (Crepitus) రావడం జరుగుతాయి.

 జాగ్రత్తలు: క్యాల్షియం కలిగి ఉన్న ఆహారపదార్థాలు తీసుకోవడం, విటమిన్ - డి కోసం ఉదయం సూర్యరశ్మిలో కాసేపు గడపడం, బరువుతగ్గడం, సరియైన వ్యాయామం చేయడం, ఎక్కువ బాధగా ఉంటే విశ్రాంతి తీసుకోవడం అవసరం.

 రుమటాయిడ్ ఆర్థరైటిస్:
 వ్యాధినిరోధకశక్తి (Immune Energy) తిరగబడటం వలన ఈ వ్యాధి వస్తుంది. ఈ వ్యాధి చిన్నకీళ్ళ నుంచి పెద్దకీళ్ళ వరకు ముఖ్యంగా చేతివేళ్ళు, మణికట్టు, మోకాలు, కాళ్ళవేళ్ళలో ఉంటుంది. నడివయస్సులో ఉన్నవారికి, స్త్రీలకు ఈ వ్యాధి ఎక్కువగా వస్తుంది.

 లక్షణాలు: కీళ్ళలో వాపు, నొప్పి, ఉదయం స్టిఫ్‌నెస్ ఉండటం, ఈ వ్యాధి శరీరానికి ఇరుపక్కల ఒకే రకమైన కీళ్ళలో ఒకేసారి రావడం (Symmetrical arthritis) జరుగుతుంది. ఇతర అవయవాలైన కళ్ళు, గుండె, ఊపిరితిత్తులు, రక్తం, నరాలు, చర్మం మీద ప్రభావం ఉంటుంది.

 యూరిక్ ఆసిడ్ ఎక్కువగా ఉండి క్రిస్టల్ డిపాజిట్ అవడం వలన గౌట్ (Gout) అనే కీళ్ళవ్యాధి వస్తుంది. ఇది చిన్న కీళ్ళలో ముఖ్యంగా కాలివేళ్లు, బొటనవేళ్ళ వాపు, నొప్పి, ఎర్రగా మారడం జరుగుతుంది.

 సోరియాసిన్ అనే చర్మవ్యాధి వలన కూడా చిన్నవేళ్ళలో వాపు, నొప్పి రావడం జరుగుతుంది. దీనిని సొరియాటిక్ ఆర్థరైటిస్ అంటారు.

 కీళ్ళు ఇన్ఫెక్షన్‌కు గురి అవడం వలన కూడా కీళ్ళలో నొప్పి రావడం జరుగుతుంది. దీని సెప్టిక్ ఆర్థరైటిస్ అంటారు.

 (SLE) (సిస్టిమిక్‌టాపస్ ఎరిటిమెటస్) అనే వ్యాధి వలన కూడా కీళ్ళలో నొప్పి, వాపు వస్తుంది. దీనిలో వ్యాధినిరోధకశక్తి తిరగబెడుతుంది.

 పరీక్షలు:
X-ray, RA, Factor, DBP, ESR, ASO tile, CRP, ANA, సీరమ్ యూరిక్ ఆసిడ్ వంటి రక్తపరీక్షలు చేయాల్సి ఉంటుంది. హోమియో వైద్యంలో రోగి యొక్క మానసిక, శారీరక లక్షణాలను పరిగణనలోకి తీసుకొని సారూప్య ఔషధం వాడటం వలన కీళ్ళవ్యాధి నుండి శాశ్వత విముక్తి పొందవచ్చును. హోమియోకేర్ ఇంటర్‌నేషనల్ కాన్‌స్టిట్యూషనల్ ట్రీట్‌మెంట్ ద్వారా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా కీళ్ళవ్యాధి నుండి శాశ్వత విముక్తి పొందవచ్చును.

Homoeo treatment for Waist pain

Homoeo treatment for Waist pain - బాధించే నడుమునొప్పి

బాధించే నడుమునొప్పి
నడుమునొప్పి గురించి విననివారు, దీనిబారిన పడనివారు ఉండరు. ముఖ్యంగా 2/3 మంది 20 సంవత్సరాలు దాటినవారిలో చూస్తాం. ముఖ్యంగా మహిళలలో ఈ నొప్పితో ఎక్కువగా బాధపడతారు. వారి జీవన విధానం, ప్రెగ్నెన్సీ, డెలివరీ, ఇంటి పనులు తీవ్రతను పెంచుతారు.

 డాక్టరు దగ్గరికి వెళ్ళేవారిలో ప్రతి ఇద్దరు ముగ్గురిలో ఈ బాధ బారిన పడేవారు ఒకరు తప్ప ఉంటారు. పనిచేయలేకపోవటం, విశ్రాంతి దీనికి అవసరం అవటంవలన వారు సెలవు దీనివలన తీసుకుంటారు. అధికంగా పని దినాలు దీనివలనే వృధా అవుతుంటాయి. నడుమునొప్పి వ్యాధి కాదు. వ్యాధి యొక్క లక్షణములు మాత్రమే. ఇది చాలా వ్యాధులలో సర్వ సాధారణంగా కనబడుతుంది. చిన్న జ్వరం నుండి బాధించే ప్యాసెట్ సైనొవ్యయల్ సిస్ట్ (Facet Synovial Cyst) నడుమునొప్పికి కారణాలు అనేకం. శరీరశ్రమ, పని ఒత్తిడి, మానసిక ఆందోళనలు కూడా కారణం అవుతాయి. మనం దీనిని మూడు విధాలుగా విభజించవచ్చును. సిస్టమ్ డిసీస్ Systemic Disease, స్ట్రెస్, టెన్షన్ వలన లేదా Nurological problem న్యూరోలాజికల్ ప్రాబ్లమ్ వలన.

 సామాన్యంగా పది మంది నొప్పులతో బాధపడేవారిలో, ఆరుగురు నడుమునొప్పి బాధ ఉన్నవారే.

 సన్నని నొప్పి, ఆగకుండా కలిగే నొప్పి, ఉప్పెన మాదిరిగా వచ్చే నొప్పి, కూర్చుంటే కలిగే నొప్పి, టూ వీలర్ నడిపితే కలిగే నొప్పి, గృహిణిలకు పనివలన కలిగే నొప్పి, పెద్దవారికి టీవీ చూస్తే నొప్పి, స్కూలు పిల్లలకు బ్యాగులు మోసి (బుక్స్) నొప్పి, కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు కూర్చునే నొప్పి, వ్యాపారులకు, ఉద్యోగులకు, రాజకీయనాయకులకు, రైతులకు పొలాలో నొప్పి, నాట్యకళాకారులకు నాట్యంలో నొప్పి, వృద్ధులకు పడుకుంటే నొప్పి, అందరినీ బాధించే నొప్పి నడుమునొప్పి.

 వివిధ కారణాలు: స్వల్పకాలిక నొిప్పి: కొన్ని రోజులు, కొన్ని వారాలు ఉండే నొప్పి ముఖ్యంగా గాయాలు, వెన్నుపూసవాపు, కండరాల శ్రమ, ఆటలలో గాయాలు, అలసటతో పనిచేయడం, బరువులు ఎత్తుట... ఇటువంటి సమయాలలో నొప్పి ఆకస్మాత్తుగా తీవ్రం గా పొడిచినట్లుగా ఉంటుంది. కదలికలలో నిర్బంధం, ఫ్రీగా తిరగలేరు, కండరాలు పట్టివేసినట్లుండటం, నిటారుగా నిలబడలేరు, చక్కగాపడుకోలేరు.

 దీర్ఘకాలిక నొప్పి : మూడు నెలల కంటే ఎక్కువైనచో కారణాలు వేరుగా ఉంటాయి. వివిధ రకాలుగా ఈ నొప్పి వివిధ భాగాలలో ఉంటుంది. వెన్నుపూసలో మార్పుల వలన వచ్చే నొప్పులు.

 డిస్క్ (వెన్నుపూస) సమస్యలు
 డిస్క్ హెర్వియేషన్
 డిస్క్‌బల్జ్ (వాపు)
 డిస్క్ ప్రొలాప్స్ (ప్రక్కకు జరుగుట)
 నర్వ్ కంప్రెషన్ కెనాల్ నారోయింగ్
 డిస్క్ లైసిస్
 డిస్క్ ట్రోమ
 డిస్క్ ఫ్యాక్టర్స్
 డిస్క్ సిండ్రోమ్స్
 స్పైనల్ టీబీ
 ఆస్టియో పొరోసిస్
 డిస్క్ వాపు, ఆర్ట్రైటిస్

 డిస్క్ (వెన్నుపూస) వాపు, పక్కకు జరుగుట వంటివాటికి కలిగే బాధలు:
 వెన్నుపూసల మధ్యన ఉండే జిగురుపదార్థం తగ్గి పక్కకు జరుగుతుంది. అపుడు నడుమునొప్పి పిరుదుల నుండి కాళ్ళ వరకు, మెడనొప్పి, భుజములు, చేతులు, తిమ్మిరి, మొద్దు బారిపోవుట, కండరాల పట్టు తగ్గుట, వణుకుట చూస్తాం.

 రోగ నిర్ధారణ:
 ఎక్స్-రే 
 ఎమ్‌ఆర్‌ఐ 
 సీటీ స్కాన్

 వాడదగిన హోమియో మందులు
 రస్టాక్స్: కండరాల, కీళ్ళ నొప్పులు, కదలికలలో నిర్బంధం (స్టిఫ్‌నెస్) చల్ల గాలి, తేమ వలన వచ్చేనొప్పి, నడుమునొప్పి, కీళ్ళ నొప్పులు.
   
 తార్నికం: గాయాలు, బెణుకుట వలన కలిగే నొప్పి,జ్వరం, కీళ్ళ నొప్పులు, వాపు, నడకతో పెరిగే నొప్పులు.
   
 సిమిసిపూగ: స్త్రీల సంబంధ నొప్పులు, మెన్సెస్ టైమ్‌లో పెరిగే నొప్పులు, వాతావరణ మార్పుల వలన కలిగే నొప్పులు
   
 కాస్టకమ్: కండరాల పటుత్వం, నిర్బంధం, కీళ్ళవాపు, కండరాల క్షీణత, ఎక్కువ చలి వేడి పడదు, నడకతో పెరిగే నొప్పి.
   
 అకొటైట్: ఉప్పెనలాంటి నొప్పులు, భయం, ఆందోళన విపరీతమైన నొప్పి, ప్రాణభయం, నరాలసంబంధ నొప్పులు.
   
 బెల్లడొనా: కీళ్ళ వాపు, కండరాల నొప్పి, తీవ్రంగా, సడెన్‌గా వచ్చే నొప్పి, జ్వరం, కండరాలు పట్టి వేయుట, స్పాజెర్స్.

 హోమియో చికిత్స
 హోమియో వైద్యం ద్వారా కండరాల, కీళ్ళ, నరముల సంబంధ వ్యాధులకు స్టార్ హోమియోపతిలో నవీన చికిత్స కనుగొనబడినది. నూతన పరిశోధన ఫలితాలను అనుసరించి శారీరక, మానసిక విశ్లేషణ కారణం
 రోగ లక్షణములను, మూలకారణములు వీటిని బట్టి హోమియో మందులు సూచింపబడును.

Tags - టాగ్లు: నడుము నొప్పి, ప్యాసెట్ సైనొవ్యయల్ సిస్ట్, న్యూరోలాజికల్ ప్రాబ్లమ్, Waist pain, Facet Synovial Cyst, Nurological problem

Homoeo treatment for Spandilosis

Homoeo treatment for Spandilosis - సర్వైకల్ స్పాండిలోసిస్

సర్వైకల్ స్పాండిలోసిస్
సర్వైకల్ స్పాండిలోసిస్ సాధారణంగా మెడకు సంబంధించి లక్షణాలు కనిపిస్తాయి. అయితే మెడ వెన్నుపూసలో మార్పులు రావటం వలన వివిధ రకాల లక్షణాలు కనిపిస్తాయి. సర్వైకల్ స్పాండిలోసిస్ పురుషులలో తొందరగా, ఎక్కువగా వస్తుంది. వయసు మీరిన కొద్దీ వృద్ధులలో 90 శాతం పైన వెన్నుపూసలలో మార్పులు చూస్తాము. దీని గురించి 1992లో జరిగిన కొన్ని పరిశోధనల ప్రకారం... 40 సంవత్సరాలు దాటిన పురుషులలో ఈ వెన్నుపూసకు సంబంధించిన మార్పులు సర్వసాధారణం.

 వెన్నుపూసలో మార్పుల వలన నరాల మీద ఒత్తిడి ఏర్పడి మెడనొప్పి, మెడ పట్టి వేయటం, తలనొప్పి, కళ్ళు తరగడం, భుజాలు, చేతులు నొప్పి, తిమ్మిర్లు చూస్తాము. మెడ ఆకృతి చూస్తే మెడలోని ఏడు వెన్నుపూసలు, కండరాలు, పైన రెండు లిగమెంట్స్ మెడ వెన్నుపూస... మెడ అటు ఇటు తిరగటానికి, మిగిలినవి పటుత్వానికి ఉపయోగపడతాయి.

 వెన్నుపూసల మధ్యగా వెళ్లే వెన్నుపాము మన శరీరంలో జరిగే సమాచారాన్ని మెదడుకు చేరవేస్తుంది. మెడకు దెబ్బ తగలడం వలన, వెన్నుపూసలో మార్పుల వలన నరం మీద ఒత్తిడి పెరిగి సమాచారం చేరడంలో లోపం వలన తలతిరగడం, తిమ్మిర్లు, నడకలో తేడా రావచ్చు.

 మెడనొప్పి ముఖ్యంగా 40 సం॥దాటిన వారిలో ఎక్కువగా కనిపిస్తుంది. నేటి నవీన యుగంలో ద్విచక్ర వాహనం ఎక్కువగా నడిపేవారిలో సైకిలు తొక్కేవారిలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగులలో ఎక్కువగా చూస్తుంటాం. ఇప్పుడు 20-30 సం॥వయస్సు వారిలో కూడా ఈ వ్యాధి చూస్తున్నాము. పెరిగిన నాగరికత, నవీన ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ తగ్గడం వంటి కారణాలతో  ఇది స్త్రీ, పురుషులలో ఇద్దరికీ వస్తుంది. పురుషులలో చిన్నవయస్సులో, స్త్రీలలో 40॥తర్వాత రావడం సాధారణం.

 కారణం
 ఎముకలు అరగడం, ఎముకలలోపల జిగురు పదార్థం (కార్టిలేజ్) తగ్గడం వలన ఎముకల బలం సాంద్రత తగ్గుతుంది. ఎముకలు అరుగుట వలన ఎగుడు, దిగుడు bone spurs తయారవుతాయి. దాంతో కండరాల నొప్పి, మెడ తిప్పడంలో ఇబ్బంది, చేతులు లాగడం, మెడనొప్పి వలన పైకి చూస్తే కళ్ళు తిరగడం, ఛాతి భాగంలో నొప్పి, సూదులు పొడిచినట్లుగా నొప్పి, మంటలు, నడకలో తూలినట్లు కావడం, కండరాల రిఫ్లెక్సెస్‌లో మార్పులు, మలమూత్ర విసర్జనపై అదుపు కోల్పోవడం.

 రోగ నిర్థారణ:  1. X-Ray, 2. MRI
 చేయకూడనివి
 పరుగెత్తడం

 ఎక్కువసేపు టీవీ చూడటం, అదేపనిగా కంప్యూటర్‌పై పనిచేయడం, స్టిచ్చింగ్, ఎంబ్రాయిడింగ్ చేయడం

 నిటారుగా కూర్చోవడం

 రోజూ చిన్న చిన్న మెడ ఎక్సర్‌సైజ్ వైద్యుని సలహాపై మాత్రమే చేయాలి.

 నివారణ
 మెడ వ్యాయామం, ఫిజియోథెరపి, ట్రాక్షన్, వేడి, చల్లటి ప్యాడ్స్ వాడటం ద్వారా స్పాండిలోసిస్‌ను తగ్గించవచ్చు. దీనితోపాటు

 సరైన కుర్చీ వాడటం, నిటారుగా కూర్చోవటం

  పెద్ద దిండు వాడకుండా, ఎప్పుడూ ఛ్ఛిటఠిజీఛ్చి ఞజీౌఠీ వాడటం మెడకు సపోర్టు ఇవ్వటం
    
 ఎక్కువసేపు అదేపనిగా కంప్యూటర్, మౌస్‌ను వాడకుండా ఉండటం

  మానసిక ఆందోళన, ఒత్తిడి తగ్గించుకోవటం.

 హోమియో చికిత్స
 హోమియోపతిలో సర్వైకల్ స్పాండిలోసిస్‌కు ఖచ్చితమైన చికిత్స ఉంది. ఇది ఓపికగా కొన్ని నెలలు వాడితే వెన్నుపూసలో జరిగే మార్పులను అదుపు చేస్తూ, కండరాలకు బలం చేకూర్చుతూ, దానివలన కలిగే అనర్థాలను నివారించవచ్చు. ఆపరేషన్ వరకు వెళ్ళకుండా నివారించవచ్చు.

 ముఖ్యంగా హోమియోపతిలో కల్కేరియా గ్రూపుకు చెందిన మందులు అయిన కల్కేరియా ఫాస్, కల్కేరియా ప్లోర్, కాల్మియా, బ్రెవొనియా, స్పెజిలియ, హైపరికం జెల్సిమియం, రుస్టక్స్, కోనియం సాంగనురియ, యాసిడ్‌ఫాస్ మంచి మందులు.

Homoeo treatment for Sinusitis

Homoeo treatment for Sinusitis - సైనసైటిస్ హోమియో చికిత్స

వాతావరణ మార్పులు జరిగే వర్షాకాలం, శీతాకాలం ప్రవేశించినప్పుడు సైనస్ అనే మాటను, ఆ వెంటే... సైనసైటిస్ వస్తే ఇక ఆపరేషనే శరణ్యం అని తరచు వింటూ వుంటాం. అయితే ఆపరేషన్ తరువాత కూడా ఇది మరల మరల వచ్చి దీర్ఘకాలికంగా బాధిస్తుందని దీని బారిన పడినవారు అంటూ వుంటారు. ఒక్క యూఎస్‌లోనే 24 మిలియన్ కు పైన దీనిబారిన పడుతుంటారు. దీనిని మూడు విభాగాలుగా మనం చూడవచ్చు.
 
 Acute    వచ్చి ఒకవారం రోజులు ఉంటుంది
 Sub acute    48 వారాలు ఉంటుంది.
 Chronic-    దీర్ఘకాలిక సైనసైటిస్.
         ఇది 8-10 వారాల పైన ఉంటుంది.


 సైనసైటిస్... ఇది 90 శాతంమందిలో కనిపించే సాధారణ సమస్య. దాదాపుగా ప్రతిమనిషి జీవనకాలంలో దీని బారిన పడనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఈ సైనసైటిస్ ఇన్ఫెక్షన్ వలన, వైరస్, బ్యాక్టీరియా వల్ల కూడా వస్తుంది. ముఖ్యంగా స్టైప్టోకోకస్ నిమోనియా, ఇన్‌ఫ్లుయెంజా వలన వస్తుంది. ఈ సైనసైటిస్‌కు హోమియోలో అద్భుత చికిత్స ఉంది. పూర్తిగా మందుల ద్వారా నివారించడమే కాకుండా వ్యాధినిరోధకశక్తిని పెంచి మళ్లీ మళ్లీ రాకుండా నిరోధించవచ్చు.

 ముఖంలో కళ్ళ దగ్గర, ముక్కు పక్క భాగంలో ఎముకలలో ఉండే సన్నని గాలితో నిండే ప్రదేశాన్ని సైనస్ అంటారు. ఈ భాగం ఇన్ఫెక్షన్లతో వాచిపోవడాన్ని ‘సైనటైసిట్’ అంటారు.

 సైనస్ రకాలు...   ఫ్రంటల్  పారానాసల్  ఎత్మాయిడల్  మాగ్జిలరీ  స్ఫినాయిడల్. ఇవి కుడి, ఎడమగా రెండు జతలుంటాయి.

 కారణాలు
 ఇన్ఫెక్షన్ బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్
 శ్వాసకోశ వ్యాధులు
 ముక్కులో దుర్వాసన
 ముక్కులో దుర్వాసన పెరుగుదల
 అలర్జీ
 పొగ
 విషవాయువుల కాలుష్యం
 వాతావరణ కాలుష్యం
 అకస్మాత్తుగా వాతావరణ మార్పులు
 చలికాలం, వర్షాకాలం
 గాలిలో తేమ ఎక్కువగా ఉండే సమయం
 మంచు ప్రదేశాలు: కొడెకైనాల్, ఊటీ, జమ్ముకాశ్మీర్, మనాలి, ముస్సోరి వంటి చోట్లకు వెళ్లడం
  నీటిలో ఈదటం
 జలుబు, గొంతునొప్పి
 పిప్పిపన్ను
 టాన్సిల్స్ వాపు
 రోగనిరోధకశక్తి తగ్గటం.

 వ్యాధి లక్షణాలు
 ముఖంలో భారంగా ఉండటం, తలనొప్పి, బరువు, ముఖంలో వాపు, సైనస్ భాగంలో నొప్పి, ముక్కుదిబ్బడ, ముక్కు దురద, నీరు కారటం, గొంతులోనికి ద్రవం కారటం, గొంతు గరగర, దగ్గు, జలుబు, చెవిలో చీము, కోపం, మానసిక స్థైర్యం కోల్పోవటం, అలసట, విసుగు పనిపై శ్రద్ధ లేకుండటం, హోరు, దగ్గు.

 వ్యాధి నిర్ధారణ
 ఎక్స్‌రే
 ముఖ్యంగా ఇతర వ్యాధులతో కలిసి సైనసైటిస్ రావచ్చు.
 సైనస్ భాగంలో నొక్కితే నొప్పి
 సీటీ స్కాన్

 ఇతర దుష్పరిణామాలు
 దీర్ఘకాలికంగా సైనసైటిస్ వ్యాధితో బాధపడేవాళ్లలో కనురెప్పల వాపు, కనుగుడ్లు పక్కకు జరిగినట్లుండటం, కంటినరం దెబ్బతిని, తద్వారా చూపు కోల్పోవటం, వాసనలు తెలియకపోవటం, తరచు వచ్చే జ్వరం, ఎదుగుదల లోపాలు రావచ్చు. మానసికంగా ధైర్యం కోల్పోవటం జరగవచ్చు.

 సైనసైటిస్‌ను ఇలా నివారించవచ్చు
 నోటిని తరచు గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటూ ఉండడం. అలర్జీకి సంబంధించిన దుమ్ము, ధూళికి దూరంగా ఉండి, ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకొని చుట్టూ నీరు, బురద లేకుండా ఉంచుకోవడం.

 ఈత కొలనులో ఎక్కువ సమయం కేటాయించవద్దు. ఎందుకంటే అది ముక్కు లోపలి దళసరి చర్మాన్ని దెబ్బతీస్తాయి.

 చల్లని పదార్థాలు తీసుకోవద్దు. చల్లని గాలి తగలకుండా చెవిలో దూది పెట్టుకోవటం, వేడి ఆవిరి పట్టడం వలన కొంతవరకు నివారించవచ్చు.

 హోమియో చికిత్స
 హోమియోపతిలో ఆపరేషన్ లేకుండా మంచి మందులు ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా కాలిబైక్, కాలిసల్ఫ్, హెపర్‌సల్ఫ్, మెర్క్‌సాల్, సాంగ్ న్యురియా, లెమ్‌నా మైనర్, స్పైజిలియా వంటి మందులు ఉన్నాయి. హోమియోపతి ద్వారా ఎలాంటి శస్త్ర చికిత్స లేకుండా సైడ్‌ఎఫెక్ట్స్ లేకుండా సమూలంగా కాన్‌స్టిట్యూషన్ ట్రీట్‌మెంట్ ద్వారా చికిత్స ఉంది. హోమియోకేర్ ఇంటర్‌నేషనల్ అలర్జీ సెంటర్ ద్వారా ఎన్నో కేసుల్లో పూర్తిగా స్వస్థత కలిగించాం.




Homoeo treatment for Asthma

Homoeo treatment for Asthma - ఆస్తమా నివారణ హోమియో చికిత్సలు

మానవుడు జీవించాలంటే ప్రతిక్షణం శ్వాస ఎంతో ముఖ్యం. నీరు, ఆహారం లేకపోయినా కొన్నిరోజుల వరకు జీవించగలరు. కానీ కొన్ని క్షణాలు శ్వాస లేకపోతే శరీరం నిర్జీవమే. స్వచ్ఛమైన గాలి ద్వారా చాలావరకు మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

ఆస్తమా వలన వారి దైనందిన జీవితంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. ఏవైనా వాతావరణ మార్పులు, ఆహారంలో మార్పులు, కాలుష్యం, పొగ త్రాగడం వలన చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ, ఎక్కడికి వెళ్లాలన్నా అభద్రత భావానికి లోనవుతారు. 2005 లెక్కల ప్రకారం 115 మిలియన్లు అంటే ప్రపంచంలో 1/3 జనాభా ఇండియాలో ఉన్నారు. సుమారు 300 మిలియన్ల జనాభా ఆస్తమాతో బాధపడుతున్నారు. ఆస్తమా అంటే స్వేచ్ఛ లేని శ్వాస. ‘ఊపిరితిత్తులు దీర్ఘకాలిక శ్వాసకోశ ఇబ్బందినే ఆస్తమా అంటారు. ముఖ్యంగా ఆస్తమా వ్యాధిగ్రస్తులలో అలర్జీ రియాక్షన్ ద్వారా శ్వాసకోశాలు, ఊపిరితిత్తులలో గాలిమార్గం అడ్డుకొని శ్వాస పీల్చుకోవటంలో ఇబ్బంది ఏర్పడుతుంది. దీనివల్ల పిల్లికూతలు, దగ్గు, ఆయాసం, ఛాతిలో నొప్పి వంటి లక్షణాలు కనపడతాయి
   
 శ్వాసకోశ మార్గంలో వాపు, ఎరుపుదనం, శ్వాసనాళాలు  కుంచించుకుపోవడం.
   
 బ్రాంకియల్ కండరాల స్పాసమ్ వలన శ్వాసమార్గ ప్రక్రియలో ఇబ్బందులు కూడా కనిపిస్తాయి.

 రోగ నిర్ధారణ
 వంశానుగత చరిత్ర, అలర్జీలు, ఎగ్జిమా, చర్మవ్యాధులు, చిన్నతనంలో శ్వాసకోశ జబ్బులు
 శారీరక పరీక్షలు, ముక్కు, గొంతు, ఛాతి పరీక్షలు
 ఎక్స్-రే  కఫం పరీక్ష  పీఎఫ్‌టీ
 అలర్జీ చర్మ పరీక్షలు: అలర్జెన్స్‌ను ఇంజెక్షన్ ద్వారా ఇచ్చి రియాక్షన్ చూడటం స్పైరోమెట్రి : శ్వాసమీటర్ ద్వారా పరీక్ష
 గుండె ఊపిరితిత్తులు, రక్తలోపం, కిడ్నీ వ్యాధులు, జీర్ణకోశ వ్యాధులు   ఏవైనా ఉంటే వాటి నిర్ధారణ.

 ఆస్తమాతో జీవించడమెలా?
 ఆస్తమాతో బాధపడేవారు కూడా సాధారణ వ్యక్తుల్లాగే తమ రోజువారీ  పనులు చేసుకోవచ్చంటూ ప్రోత్సహించాలి.
   
 రాత్రి, పొద్దున్న వచ్చే శ్వాస ఇబ్బందులను నివారించటం, నిర్మూలించం, తగ్గించటం.
   
 ఎక్కువ శారీరక శ్రమలేని ఉపాధి చేసుకోవడం.
   
 దుమ్ము ధూళి, పొగ, చల్లటి వాతావరణాల నుండి దూరంగా ఉండటం.

 ఇంటి పరిసరాలు, ప్లాస్టిక్ బ్యాగ్స్, కార్పెట్స్, బెడ్‌షీట్స్, బెడ్స్, బ్లాంకెట్స్‌లో డస్ట్‌మైట్స్ (చిన్న పరాన్నజీవులు) ఉంటాయి కాబట్టి రోజుకొకసారి ఎండలో వేయటం, తరచూ నీటితో శుభ్రం చేయటం.

 పెంపుడు జంతువులను దూరంగా ఉంచాలి.

 ఎక్కువ తేమ శాతం ఉంటే డస్ట్‌మైట్స్ పెరుగుదల ఎక్కువగా ఉంటుందని గుర్తెరిగి అప్రమత్తంగా ఉండాలి.

 రోగ నివారణ
 బ్రాంకోడయలేటర్స్, కార్టికో స్టెరాయిడ్స్, ఆంటీబయాటిక్స్, స్ప్రేస్, మందులు... వీటివలన వెంటనే ఉపశమనం కలుగుతుంది. కాని వ్యాధి మళ్ళీ తిరగబెడుతుంది. దీర్ఘకాలికంగా వాడటం వలన మందుల సైడ్‌ఎఫెక్ట్స్, పిల్లల పెరుగుదల లోపాలు, మానసిక ఆందోళన, జ్ఞాపకశక్తి తరుగుదల, బరువు పెరగడం వంటివి కలగవచ్చు.

 ఆస్తమాను ఎలా నివారించవచ్చు?
 మెడిటేషన్, యోగా వలన చాలా వరకు నివారించవచ్చును.

 టొబాకో, పొగత్రాగడం, కాలుష్యపదార్థాలకు దూరంగా ఉండటం ద్వారా.

 స్వచ్ఛమైన గాలి, నీరు ఉన్న ప్రదేశాలలో నివసించడం ద్వారా.

 వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంటే... వాళ్లకు ఆ ప్రదేశం వల్ల ఆస్తమా వస్తోందని గుర్తించి అక్కడి నుండి వేరే ప్రదేశానికి మారడం.

 హోమియో వైద్యం
 హోమియో వైద్యం ద్వారా ఆస్తమాకు చక్కటి చికిత్సను అందించవచ్చు. ముఖ్యంగా పిల్లలలో కలిగే అలర్జీలు, శ్వాసకోశ ఇబ్బందులు, శారీరక, మానసిక విశ్లేషణ ద్వారా వారి కాన్‌స్టిట్యూషనల్ మెడిసిన్‌ను గుర్తించి తగిన చికిత్స జరిపి, వ్యాధిని సమూలంగా తగ్గించవచ్చును.

 వాడదగిన మందులు
 ఆంటీమ్‌టార్ట్, యాంటీమోనియమ్ అర్స్, ఆర్సినిక్ ఆల్బ్, స్పాంజియా, లోబిలియా, నేట్రంసల్ఫ్, ఆరీలియా, కార్బొవెజ్

 ఆస్తమాకు ముఖ్య కారణాలు

 చల్లగాలి (చల్లటి వాతావరణం)
 దుమ్ము ధూళి  పొగ (సిగరెట్)
 అలర్జెన్స్, గడ్డిచెట్లు, ఫంగస్, పొల్యూషన్
  కెమికల్ పర్‌ఫ్యూమ్స్ (ఘాటు వాసనలు)
 వైరల్ ఇన్‌ఫెక్షన్ 
 పిల్లి, గుర్రం, కుక్క వంటి పెంపుడు జంతువుల విసర్జన పదార్థాలు
 శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్స్ ముఖ్యంగా పిల్లలలో.

 

Blogger news

In this blog - [ http://dls-joy.blogspot.in/ ]I am posting various articles related to Education, Science and technology, Wonders etc. In my another blog - [ http://depaspi.blogspot.in/ ]I am posting Annamayya Kritis/Keettannas in Telugu and English Translation.

Blogroll

These are the Blogs which I started as a Hobby: http://dls-joy.blogspot.in/ http://depaspi.blogspot.in/

About

These are the collections of various articles related to Education, Science, Technology, General Knowledge, Wonders etc.,from News Papers, magazines, journals and web services like youtube videos etc.