Homoeo treatment for Spandilosis - సర్వైకల్ స్పాండిలోసిస్
వెన్నుపూసలో మార్పుల వలన నరాల మీద ఒత్తిడి ఏర్పడి మెడనొప్పి, మెడ పట్టి వేయటం, తలనొప్పి, కళ్ళు తరగడం, భుజాలు, చేతులు నొప్పి, తిమ్మిర్లు చూస్తాము. మెడ ఆకృతి చూస్తే మెడలోని ఏడు వెన్నుపూసలు, కండరాలు, పైన రెండు లిగమెంట్స్ మెడ వెన్నుపూస... మెడ అటు ఇటు తిరగటానికి, మిగిలినవి పటుత్వానికి ఉపయోగపడతాయి.
వెన్నుపూసల మధ్యగా వెళ్లే వెన్నుపాము మన శరీరంలో జరిగే సమాచారాన్ని మెదడుకు చేరవేస్తుంది. మెడకు దెబ్బ తగలడం వలన, వెన్నుపూసలో మార్పుల వలన నరం మీద ఒత్తిడి పెరిగి సమాచారం చేరడంలో లోపం వలన తలతిరగడం, తిమ్మిర్లు, నడకలో తేడా రావచ్చు.
మెడనొప్పి ముఖ్యంగా 40 సం॥దాటిన వారిలో ఎక్కువగా కనిపిస్తుంది. నేటి నవీన యుగంలో ద్విచక్ర వాహనం ఎక్కువగా నడిపేవారిలో సైకిలు తొక్కేవారిలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగులలో ఎక్కువగా చూస్తుంటాం. ఇప్పుడు 20-30 సం॥వయస్సు వారిలో కూడా ఈ వ్యాధి చూస్తున్నాము. పెరిగిన నాగరికత, నవీన ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ తగ్గడం వంటి కారణాలతో ఇది స్త్రీ, పురుషులలో ఇద్దరికీ వస్తుంది. పురుషులలో చిన్నవయస్సులో, స్త్రీలలో 40॥తర్వాత రావడం సాధారణం.
కారణం
ఎముకలు అరగడం, ఎముకలలోపల జిగురు పదార్థం (కార్టిలేజ్) తగ్గడం వలన ఎముకల బలం సాంద్రత తగ్గుతుంది. ఎముకలు అరుగుట వలన ఎగుడు, దిగుడు bone spurs తయారవుతాయి. దాంతో కండరాల నొప్పి, మెడ తిప్పడంలో ఇబ్బంది, చేతులు లాగడం, మెడనొప్పి వలన పైకి చూస్తే కళ్ళు తిరగడం, ఛాతి భాగంలో నొప్పి, సూదులు పొడిచినట్లుగా నొప్పి, మంటలు, నడకలో తూలినట్లు కావడం, కండరాల రిఫ్లెక్సెస్‌లో మార్పులు, మలమూత్ర విసర్జనపై అదుపు కోల్పోవడం.
రోగ నిర్థారణ: 1. X-Ray, 2. MRI
చేయకూడనివి
పరుగెత్తడం
ఎక్కువసేపు టీవీ చూడటం, అదేపనిగా కంప్యూటర్‌పై పనిచేయడం, స్టిచ్చింగ్, ఎంబ్రాయిడింగ్ చేయడం
నిటారుగా కూర్చోవడం
రోజూ చిన్న చిన్న మెడ ఎక్సర్‌సైజ్ వైద్యుని సలహాపై మాత్రమే చేయాలి.
నివారణ
మెడ వ్యాయామం, ఫిజియోథెరపి, ట్రాక్షన్, వేడి, చల్లటి ప్యాడ్స్ వాడటం ద్వారా స్పాండిలోసిస్‌ను తగ్గించవచ్చు. దీనితోపాటు
సరైన కుర్చీ వాడటం, నిటారుగా కూర్చోవటం
పెద్ద దిండు వాడకుండా, ఎప్పుడూ ఛ్ఛిటఠిజీఛ్చి ఞజీౌఠీ వాడటం మెడకు సపోర్టు ఇవ్వటం
ఎక్కువసేపు అదేపనిగా కంప్యూటర్, మౌస్‌ను వాడకుండా ఉండటం
మానసిక ఆందోళన, ఒత్తిడి తగ్గించుకోవటం.
హోమియో చికిత్స
హోమియోపతిలో సర్వైకల్ స్పాండిలోసిస్‌కు ఖచ్చితమైన చికిత్స ఉంది. ఇది ఓపికగా కొన్ని నెలలు వాడితే వెన్నుపూసలో జరిగే మార్పులను అదుపు చేస్తూ, కండరాలకు బలం చేకూర్చుతూ, దానివలన కలిగే అనర్థాలను నివారించవచ్చు. ఆపరేషన్ వరకు వెళ్ళకుండా నివారించవచ్చు.
ముఖ్యంగా హోమియోపతిలో కల్కేరియా గ్రూపుకు చెందిన మందులు అయిన కల్కేరియా ఫాస్, కల్కేరియా ప్లోర్, కాల్మియా, బ్రెవొనియా, స్పెజిలియ, హైపరికం జెల్సిమియం, రుస్టక్స్, కోనియం సాంగనురియ, యాసిడ్‌ఫాస్ మంచి మందులు.
Tags - టాగ్లు:
స్పాండిలోసిస్, హోమియో చికిత్స, డాక్టర్ మురళి అంకిరెడ్డి, Spandilosis, Homoeo treatment, Dr. Murali ankireddi
No comments:
Post a Comment