Pages

Showing posts with label homoeopathy. Show all posts
Showing posts with label homoeopathy. Show all posts

Hepatitis - Homeopathy

Homoeopathic medicines for Hepatitis
హెపటైటిస్‌కు హోమియో మందులు

హెపటైటిస్‌కు హోమియో మందులు
1. జెల్సీమియమ్ 200: విపరీతమైన భయం, ఆందోళన కలవారికి; అక్యూట్ హెపటైటిస్ లక్షణాలు అంటే... నీరసం, ఆకలి మందగించడం, విరేచనాలు ఉన్నవారికి.

2. అకోనైట్ 200: హెపటైటిస్‌తో పాటు కళ్లు ఎర్రబారడం, చర్మం గులాబిరంగులోకి మారడం, మూత్రం ఎర్రగా మారడం, విపరీతమైన జ్వరం గలవారికి.

3. టారెన్‌టులా 200: సాలెపురుగు నుంచి ఈ మందు తయారు చేస్తారు. హెపటైటిస్ లక్షణాలతో పాటు ఉలిక్కిపడటం, అతిభయం, దాహం తక్కువగా ఉండటం, విపరీతమైన జ్వరం ఉన్నవారికి.

4. సిక్యూటా వీరోజా: చెట్ల నుంచి తయారు చేసే ఈ మందు మూర్చవ్యాధిని అణచివేయడం వల్ల వారికి వచ్చే జబ్బులకు పనిచేస్తుంది. ఇక జబ్బును పెద్దగా ఊహించుకుని ఆందోళన చెందేవారికీ మంచి మందు. దీన్ని 200 పొటెన్సీలో రెండుపూటలా ఉపయోగించాలి.

5. బ్రయోనియా: విపరీతమైన ఒళ్లునొప్పులు, గ్యాస్ అధికంగా ఉండటం, అధిక దాహం, ఆకలి మందగించడం; వ్యాపార లావాదేవీల గురించి ఎక్కువగా ఆలోచించడం చేసేవారికి.

క్రానిక్ హెపటైటిస్:


1. సల్ఫర్: శుభ్రత సరిగా పాటించనివారికి, చర్మవ్యాధులు అణచివేసిన తర్వాత జబ్బు వచ్చిన వారికి ఈ మందు డాక్టర్ పర్యవేక్షణలో 200 పొటెన్సీతో వాడాలి.

2. చెలిడోనియమ్: దీర్ఘకాలిక హెపటైటిస్ వల్ల కాలేయం దెబ్బతిన్నవారికి, కడుపులో ఉబ్బరంగా ఉండటం, అసైటిస్ (జలోదరం), కాళ్లవాపులు ఉన్నవారికి ఇది మంచి మందు.

3. లైకోపోడియమ్: జబ్బు గురించి ఎక్కువగా ఆందోళన చెందేవారికి ఈ ఔషధం అద్భుతంగా పనిచేస్తుంది. చిరాకు, కోపం ఉండటం; తీపి పదార్థాలను ఇష్టపడటం, దాహం తక్కువగా ఉండటం, త్వరగా ఏడ్చేసే స్వభావం ఉన్నవారికి, వేడిని తట్టుకోలేని వారికి ఇది బాగా పనిచేస్తుంది.

4. యాంటిమోనియమ్ క్రూడమ్: సున్నితమనస్కులు, ఊహాలోకంలో ఉండేవారికి ఇది బాగా పనిచేస్తుంది.

5. పల్సటిల్లా: తెలివైనవారికి, ఇంటిగురించి అధికంగా ఆలోచించేవారికి, శాంతస్వభావం గలవారికి త్వరగా ఏడ్చే స్వభావం ఉన్నవారికి ఇది మంచి మందు.

6. మెర్క్‌సాల్: అతిగా ఆహారం తీసుకోవడం, జబ్బును నిర్లక్ష్యం చేసేవారికి, అధిక చెమటలు, అధిక దాహం, చెడువాసన కలిగిన చెమట వచ్చేవారికి దీన్ని 200 పొటెన్సీలో నెలకు ఒక డోస్ ఇవ్వాలి.

7. నేట్రమ్‌మూర్: సున్నిత మనస్కులు, అసంతృప్తి భావన, ఉప్పు, పులుపు ఇష్టపడేవారికి బాగా పనిచేసే మందు.

8. చైనా: అసంతృప్తి, దురదృష్టజీవితం, చిరాకు, కోపం, మాటిమాటికీ మలేరియాతో బాధపడిన వాళ్లలో వచ్చిన హెపటైటిస్‌కు ఇది మంచి మందు.

హెపటైటిస్‌లో ఐదు రకాలు ఉంటాయి కాబట్టి వచ్చిన ఇన్ఫెక్షన్‌ను బట్టి, అతడి జబ్బు లక్షణాలు, వ్యక్తిగత స్వభావాలను పరిగణనలోకి తీసుకుని, గత వైద్యచరిత్రను కూడా పరిశీలించి మందు ఇవ్వాలి. చికిత్స చేసి, జబ్బునయం చేయడం కంటే రోగనిరోధకశక్తిని పెంపొందించడానికి ఈ మందు బాగా ఉపయోగపడుతుంది.

Backpain - Homoeopathy Treatment

Backpain - Homoeopathy Treatment : వెన్నునొప్పి - హోమియోపతి వైద్యం

మనం నిటారుగా నిలబడి ఉండటానికి కారణమైన ప్రధాన అవయవం ‘వెన్ను’. అందుకే మన జాతీయాల్లోనూ, నుడికారాల్లోనూ ఒకరిపై ఆధారపడకుండా మనకై మనమే జీవించడానికి ప్రతీకగా ‘వెన్నెముక’ను పేర్కొంటుంటారు. అందుకే స్వతంత్రంగా వ్యవహరించని వాళ్లకు ‘వెన్నెముక’ లేదంటుంటారు. ప్రధానమైన వ్యవసాయ వృత్తిలో ఉన్న రైతును దేశానికి వెన్నెముకగా అభివర్ణిస్తారు. అంత ప్రధానమైన ఈ వెన్నుకు వచ్చే బాధలను తెలుసుకుందాం...

మన కాళ్లపై మనం  ఉండటానికి దోహదపడే ఈ వెన్నెముక పుర్రె చివర నుంచి మొదలై, నడుం కింది వరకు ఉంటుంది. మెదడు చివరి భాగం (మెడుల్లా అబ్లాంగేటా) నుంచి నడుం వరకు ఉండే వెన్నుపాముకు రక్షణకవచంలా ఒకదానినొకటి లింకుల్లా ఏర్పడి 32 నుంచి 34 వెన్నుపూసలు ఒక వెన్నెముకగా ఉంటాయి. దీన్నే స్పైన్ అంటారు. ఇందులో మెడ భాగంలో ఏడు (సర్వైకల్), ఛాతి, కడుపు భాగంలో పన్నెండు (థోరాసిక్), నడుం భాగంలో ఉండేవి ఐదు (లంబార్), మిగతావి ఒకదాంతో మరోటి కలిసిపోయి ఉండే శాక్రల్ ఎముకలు. కాక్సిక్ అనేది చివరన తోకలా ఉండే ఎముక. వీటిల్లో ఏ భాగానికి నొప్పి వచ్చినా దాన్ని వెన్నునొప్పిగానే పేర్కొంటారు. ఇక వెన్నెముకలోని 32-34 ఎముకల్లో... ప్రతి దాని మధ్య నుంచి ఒక్కోనరం చొప్పున మొత్తం 31 నరాలు బయటకు వస్తాయి. వెన్నుపూసల అరుగుదల వల్ల ఈ నరాలపై ఏమాత్రం ఒత్తిడి పడ్డా నొప్పి వస్తుంది. వెన్నెముక నొప్పుల్లో రకాలను చూద్దాం.

 మెడనొప్పి: మెడ భాగంలో ఉండే వెన్నెముకలను సర్వైకల్ పూసలు అంటాం కదా, అవి అరగడం వల్ల వచ్చే నొప్పిని ‘సర్వైకల్ స్పాండిలోసిస్’ అంటారు. మెడనొప్పికి ముఖ్యకారణం ఇదే. తలపై బరువులు మోసేవారికి, కంప్యూటర్ దగ్గర ఎక్కువ సమయం పనిచేసే వారికి, డ్రైవింగ్ చేసేవారికి ఎక్కువగా వస్తుంది. స్త్రీలలో ఎక్కువగా కనిపిస్తుంది. ముఖ్యంగా కంప్యూటర్‌పై పనిచేసే వారిలో, రాతపని, కుట్లు, అల్లికలు చేసే వారిలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. వెన్నెముకలోని ఎముక భాగాలు అరిగిపోవడం దీనికి ప్రధాన కారణం. వయసు పైబడటం వల్ల ఎముక భాగాలు అరిగిపోతుంటాయి. స్త్రీలలో మెనోపాజ్ దశ వచ్చేసరికి కాల్షియం గ్రహించడం తగ్గిపోతుంది. దీనికితోడు కాల్షియం లభించే ఆహార పదార్థాలను తీసుకోకపోవడం వల్ల సమస్య తలెత్తుతుంది.

 ఈ సమస్య ఉన్నవారిలో నొప్పి మెడ నుంచి భుజం వరకు లేదా ఛాతి వరకు పాకుతుంది. ఈ నొప్పి కరెంట్ షాక్‌లా లేదా మంటపుట్టినట్టుగా ఉంటుంది. ఈ సమస్య ఉన్నప్పుడు తలతిరగడం, మెడ నొప్పి ఉంటుంది.

 నడుమునొప్పి: నడుం భాగంలోని వెన్నుపూసల్లో అరుగుదల వల్ల ఈ నొప్పి వస్తుంది. నొప్పి వచ్చే భాగాన్ని బట్టి పేర్లుంటాయి. వాటిలో స్పాండిలైటిస్, టెయిల్ పెయిన్, సయాటికా నొప్పి ముఖ్యమైనవి. లాంబార్ స్పాండిలైటిస్ కూర్చుని పనిచేసే వారికి, బరువులెత్తే వారిలో, నడుముకి దెబ్బలు తగిలిన వారిలో, మహిళల్లో కాన్పు తర్వాత వస్తుంటుంది. ఈ నొప్పి సూదులతో గుచ్చినట్టుగా, మంటగా ఉంటుంది.

 టెయిల్ పెయిన్: వెన్నుపూసల కిందిభాగంలో ఈ నొప్పి వస్తుంది. కూర్చున్నా, నిల్చున్నా నొప్పి ఎక్కువగా వస్తుంది. ఇది స్త్రీలలో ఎక్కువ.

 సయాటికా: సయాటికా అనేది కాలి భాగాన్ని బాధపెట్టే నాడీ సంబంధ నొప్పి. ఈ సమస్య ఎడమ లేదా కుడివైపు ఎక్కడైనా రావచ్చు. ఇది కూడా స్త్రీలలోనే ఎక్కువ. సయాటికా అనేది కాలిలోకి వెళ్ళే అతి పెద్ద నాడి. వెన్నెముకలోని వెన్నుపూసలు అరగడం వల్ల వాటి మధ్య ఉన్న కార్టిలేజ్ మీద ఒత్తిడి పడుతుంది. కార్టిలేజ్ మధ్యలో ఉండే సయాటికా నాడి ఒత్తిడికి లోనవుతుంది. దాంతో సయాటికా నాడి ఏయే భాగాలతో అనుసంధానించి ఉంటుందో ఆయా భాగాలలో నొప్పి  మొదలవుతుంది. ఆ బాధ కరెంట్ షాక్‌లా ఉండి నడవలేక, నిలబడలేక, కూర్చోలేక వర్ణనాతీతంగా ఉంటుంది.

 సయాటికా లక్షణాలు:
సయాటికా సమస్యకు కొన్ని ప్రధాన లక్షణాలున్నాయి. ఇవి అన్ని సందర్భాలలోనూ అందరిలోనూ ఒకేసారి ఒకేలా కనిపించకపోవచ్చు. ముందుగా నొప్పి నడుములో ప్రారంభమై పిరుదులలోకి, అక్కడి నుంచి తొడల్లోకి, అక్కడి నుంచి పిక్కల్లోకి వ్యాపిస్తుంది, దగ్గినా, తుమ్మినా, ఎక్కువసేపు కూర్చున్నా సమస్య అధికం అవుతుంది.


 రెండు కాళ్ళలోనూ, ఒకే స్థాయిలో కాకుండా, ఏదో ఒక కాలిలో ఈ సమస్య తీవ్రంగా ఉంటుంది. తిమ్మిర్లు కూడా ఉండవచ్చు. సయాటికా నాడి ప్రయాణించే మార్గంలో అంటే కాలిలోనూ పాదంలోనూ ఉంటుంది. సూదులు గుచ్చినట్లుగా నొప్పి ఉంటుంది. కాలు, నడుము బిగుసుకుపోయినట్టు ఉంటుంది. కూర్చున్నా, నిలబడినా నొప్పిగానే ఉంటుంది.

 కారణాలు:
అధిక బరువులు ఎత్తడం  కాళ్ళకు ఎత్తుమడమల చెప్పులు వాడడం  గతుకుల రోడ్లమీద తరచుగా ప్రయాణం చెయ్యాల్సిరావడం పోషకాహార లోపం, ముఖ్యంగా కాల్షియం లోపం దీర్ఘకాలిక దగ్గు, తుమ్ముల వల్ల నొప్పి తీవ్రం అవుతుంది. ఇవి గాక మరిన్ని వెన్ను సంబంధమైన నొప్పిలు కనిపిస్తాయి...


హెర్నియేటెడ్ డిస్క్: ఎక్కువగా డ్రైవింగ్, కంప్యూటర్ వర్క్‌చేసే వారిలో ఈ సమస్య ఉంటుంది.

 స్టెనోసిస్, ఆస్టియో ఆర్థరైటిస్: ప్రాథమిక దశలో గురిస్తే ఈ సమస్యను త్వరగా అరికట్టవచ్చు.

 మెకానికల్ ఇంజ్యురీ:  సాధారణ అరుగుదలతో కాకుండా, ఏదైనా దెబ్బ తగలడం వల్ల వెన్నెముకకు భౌతికంగా గాయం అయి వచ్చే నొప్పిని మెకానికల్ ఇంజ్యూటరీ వల్ల వచ్చే నొప్పిగా పేర్కొంటారు.

 వెన్నునొప్పి నివారణా మార్గాలు:
ఎక్కువసేపు కూర్చోవలసిన పరిస్థితి వచ్చినప్పుడు ఒకసారయినా లేచి ఐదు నిమిషాల పాటు అటూ ఇటూ తిరగాలి. బరువయిన వస్తువులను వంగి ఎత్తకూడదు. ఆహారపు అలవాట్లు, జీవనశైలిని మార్చుకోవాలి.


 హోమియోపతి చికిత్స: వెన్నునొప్పి, నడుము నొప్పికి హోమియో మందులో అద్భుతమైన ఔషధాలున్నాయి. నొప్పి నివారణ మాత్రల మాదిరిగా తాత్కాలిక ఉపశమనాన్ని అందించకుండా మూలకారణాన్ని తొలగించి నడుము నొప్పి నుంచి శాశ్వత విముక్తిని అందిస్తాయి. శరీరంలో సమసతుల్యతను కాపాడే విధంగా హోమియోపతి వైద్యం పనిచేస్తుంది. దీనితో డిస్క్ సమస్య, కార్టిలేజ్ సమస్యను శాశ్వతంగా నివారించవచ్చు. స్పాండిలైటిస్, స్టెనోసిన్, సయాటికా సమస్యలు ఇట్టే తొలగిపోతాయి. బ్రయోనియా, రస్టాక్స్, లెడంపాల్, హైపరికం వంటి మందులు వ్యాధి తీవ్రతను తగ్గించడంలోనూ, శాశ్వత పరిష్కారాన్ని చూపించడంలో ఉపయోగపడతాయి. దీనితో పాటు కొలోసింథ్, పల్సటిలా అన్న మందులు కూడా ఈ నొప్పుల విషయంలో ఆలోచించాల్సినవే.  నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో వైద్యం చేయించుకుంటూ పోషకాహారం, ఫిజియోథెరపి, యోగా క్రమబద్ధంగా చేయడం ద్వారా సయాటికా మొదలుకొని, అన్ని వెన్నునొప్పులనూ శాశ్వతంగా దూరం చేయవచ్చు.

Homoeopathy Treatment for Migraine Headache

Homoeopathy Treatment for Migraine Headache -                  మైగ్రేన్ (పార్శ్వపు తలనొప్పి)


తరచుగా తలనొప్పి వస్తే అశ్రద్ధ చేయకూడదు. ఎందుకంటే తలనొప్పికి చాలా కారణాలున్నాయి. రక్తపోటు, మెదడులో కణతులు, రక్తనాళాలలో రక్తప్రసరణలో మార్పులు, మానసిక ఒత్తిడి, నిద్రలేమి వల్ల, మగవారిలో రక్తపోటు, మానసిక ఒత్తిడి, మెదడులోని కణుతుల వల్ల తలనొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. మైగ్రేన్ తలనొప్పి స్త్రీలలో అధికంగా చూస్తుంటాం. ఈ నొప్పి చాలావరకు తలకు ఒక పక్క వస్తుంది. వాంతులూ ఉండవచ్చు. తలలోని రక్తనాళాలు ఒత్తిడికి లోనయి వాచడం వల్ల ఈ నొప్పి వస్తుంది.

 పార్శ్వపు తలనొప్పికి కారణాలు
 పార్శ్వపునొప్పికి మానసిక ఆందోళన, ఒత్తిడి  ముఖ్య కారణాలు. అనవసరపు ఆలోచనలు, జరిగిపోయిన విషయాలను తరచుగా ఆలోచించడం వల్ల వస్తుంది.
 డిప్రెషన్, నిద్రలేమి
 కొందరిలో బయటకు వెళ్లినప్పుడు, సూర్యరశ్మి వల్ల
 అధికంగా ప్రయాణాలు చేయడం వల్ల వస్తుంది.

 స్త్రీలలో హార్మోన్ల సమస్యలు ఏర్పడినప్పుడు, ఋతుచక్రం ముందుగా గాని, తర్వాత గాని వచ్చే అవకాశం ఉంటుంది. గర్భధారణ సమయంలో, స్త్రీలలో ఋతుచక్రం ఆగిపోయినపుడు. ఈ సమస్య తీవ్రమయ్యే అవకాశం ఉంటుంది.

 ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్ లాంటి కొన్ని రకాల మందులు వాడటం వల్ల వాడినప్పుడు కూడా రావచ్చు.

 మైగ్రేన్ దశలు - లక్షణాలు
 సాధారణంగా 24 - 72 గంటల్లో దానంతట అదే తగ్గవచ్చు. 
 ఒకవేళ నొప్పి 72 గంటలు ఉంటే స్టేటస్ మైగ్రేన్ అంటారు
 మైగ్రేన్‌నొప్పి 4 దశలలో సాగుతుంది.

 ప్రొడ్రోమ్ ఫేజ్: ఇది నొప్పికి ముందు 2 గంటల నుంచి 2 రోజుల ముందు వరకు జరిగే ప్రక్రియల సమూహం. ఈ దశలో చిరాకు, మానసిక ఆందోళన, డిప్రెషన్, ఆలోచనలో మార్పులు రావడం, వాసన, వెలుతురు పడకపోవడం, మెడనొప్పి ఉంటాయి.

 ఆరా ఫేజ్: ఈ దశ నొప్పి ప్రారంభానికి కొద్ది నిమిషాల ముందు ఉంటుంది. చూపు మందగించడం, జిగ్ జాగ్ లైన్స్ కనిపించడం, తలలో సూదులు గుచ్చిన ఫీలింగ్, మాటల తడబాటు, కాళ్ళలో నీరసం ఉంటాయి.

 నొప్పిదశ:
ఈ నొప్పి దశ 2 గంటల నుంచి 3 రోజుల వరకు ఉండే అవకాశం ఉంటుంది. ఈ దశలో వాంతులు ఉంటాయి. చాలా వరకు ఒకవైపునే ఉంటుంది. కాంతికి, ధ్వనికి చాలా సెన్సిటివ్‌గా అంటే చికాగ్గా అనిపిస్తుంది.


 పోస్ట్‌డ్రోమ్ ఫేజ్: నొప్పి తగ్గిన తర్వాత కొద్దిరోజుల వరకు తల భారంగా అనిపిస్తుంది. ఒళ్లంతా నీరసంగా, నిరాసక్తంగా అనిపిస్తుంది.

 వ్యాధి నిర్ధారణ :  
 రక్త పరీక్షలు-సీబీపీ, ఈఎస్‌ఆర్ 
 రక్తపోటును గమనించడం
 ఈఈజీ పరీక్ష
 సిటీ స్కాన్ (మెదడు)
 ఎంఆర్‌ఐ మెదడు పరీక్షలు ఉపకరిస్తాయి.

 మైగ్రేన్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు:  మానసిక ఆందోళనలు తగ్గించాలి.

 అతిగా ఆలోచనలు చేయకూడదు.  
 మానసిక ఒత్తిడి తగ్గించుకోవాలి. దీనికోసం యోగా, ప్రాణాయామం చేయాలి.ధ్యానం ద్వారా మానసిక ప్రశాంతత లక్షిస్తుంది.
 తలకు నూనెతో మసాజ్ చేసుకుంటే తలలోని నరాలు రిలాక్సవుతాయి.

 తలనొప్పి వచ్చినప్పుడు ప్రశాంత వాతావరణంలో, లైటు తీసేసి నిశ్శబ్దంగా ఉన్నచోట పడుకోబెట్టాలి.

 హోమియో వైద్యం
 మైగ్రేన్ తలనొప్పికి హోమియోలో మంచి మందులున్నాయి.
1) ఘాటైన వాసనలు పీల్చినప్పుడు వస్తే, బెల్లడోనా, లైకోపోడియం, ఇగ్నిషియా ఇవ్వాలి.
2) తరచు ఎక్కువగా వస్తుంటే - నాట్రంమూర్, సాంగ్యునేరియా, చైనా, సెపియా ఇవ్వాలి.
3) గర్భవతుల్లో వస్తే బెల్లడోనా, నక్స్‌వామికా, సెపియా ఇవ్వాలి.
4) ఎక్కువగా చదవడం వల్ల వస్తే కాల్కేరియా కార్బ్, నాట్రంమూర్, ట్యూబర్కిలినమ్.
5) ప్రయాణాల వల్ల వస్తే - ఇగ్నిషియా, సెపియా, కాక్యులస్, కాలికార్బ్ ఇవ్వాలి.
6) స్కూల్‌కి వెళ్లే ఆడపిల్లలలో వస్తే - కాల్కేరియాఫాస్, నాట్రంమూర్, పల్సటిల్లా ఇవ్వాలి.
Note: పైన తెలిపిన మందులు కేవలం అవగాహనకు మాత్రమే. వాటిని నిష్ణాతులైన హోమియో డాక్టర్‌ని సంప్రదించి మాత్రమే తీసుకోవాలి.

Homoeopathy treatment for Cervical spondylosis

Homoeopathy treatment for Cervical spondylosis -                  మెడనొప్పి (సర్వైకల్ స్పాండిలోసిస్) - హోమియో చికిత్స


మెడనొప్పి (సర్వైకల్ స్పాండిలోసిస్) - హోమియో చికిత్స
ఈమధ్య చాలామందిని వేధిస్తున్న సమస్య మెడనొప్పి. ఒకప్పుడు వృద్ధుల్లో మాత్రమే కనిపించే సర్వైకల్ స్పాండిలోసిస్ ఇప్పుడు వయసుతో నిమిత్తం లేకుండానే వస్తోంది. యుక్తవయసులో ఉన్నవారు సైతం సమస్యను ఎదుర్కొంటున్నారు. దీనికి ముఖ్యకారణం మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు. మెడనొప్పే కదా అని నిర్యక్ష్యం చేస్తే సమస్య మరింత తీవ్రమవుతుంది. తొలిదశలోనే చికిత్స తీసుకుంటే సమస్య త్వరగా నయమవుతుంది.

 కారణం: మెడ వెనక భాగంలో తల నుంచి మొదలయ్యే మొదటి ఏడు వెన్నుపూసల మధ్య కార్టిలేజ్ (మృదులాస్థి) అనే మెత్తటి ఎముక ఉంటుంది. వెన్నుపూసలు సులువుగా కదలేందుకు ఈ కార్టిలేజ్ తోడ్పడుతుంది. అయితే అసంబద్ధ భంగిమల్లో కూర్చోవడం, కంప్యూటర్ల ముందు ఎక్కువసేపు కదలకుండా కూర్చుని విధులు నిర్వర్తించడం, ఒకేచోట గంటల తరబడి కదలకుండా పనిచేయడం, నిత్యం తీసుకునే ఆహారంలో క్యాల్షియం, విటమిన్స్ తగినంత లేకపోవడం మొదలైన కారణాలతో ఈ కార్టిలేజ్ క్షీణించడం జరుగుతుంది. ఇలా కార్టిలేజ్‌లో వచ్చే మార్పులవల్ల మెడనొప్పి వస్తుంది. దీన్నే ‘సర్వైకల్ స్పాండిలోసిస్’ అంటారు.

 లక్షణాలు:  

 మెడనొప్పి తీవ్రంగా ఉండి మెడ ఎటువైపు కదిల్చినా నొప్పి తీవ్రవుతుంది.
 వెన్నుపూస నుంచి చేతులకు బయలుదేరే నాడులు ఒత్తిడికి గురికావడం వల్ల నొప్పి భుజాల మీదుగా చేతులకు క్యాపిస్తుంది. తిమ్మిర్లు ఎక్కువగా ఉండి, ఒక్కోసారి తలతిరిగినట్లుగా (వర్టిగో) అనిపిస్తుంది.  చేయి పైకిఎత్తడం కష్టమవుతుంది.

 జాగ్రత్తలు
 సర్వైకల్ స్పాండిలోసిస్‌తో బాధపడేవారు సమస్య తీవ్రంగా ఉన్నప్పుడు వీలైనంత విశ్రాంతి తీసుకోవాలి.
 కుర్చీలో కూర్చున్నప్పుడు, వాహనం నడిపేటప్పుడు నిటారుగా ఉండేవిధంగా సరైన భంగిమలో కూర్చోవాలి
 బరువులు ఎక్కువగా లేపకూడదు
 పడుకునేటప్పుడు తలకింద ఎత్తై దిండ్లు వాడకూడదు
 మెడను ఒకేసారి అకస్మాత్తుగా తిప్పకూడదు
  మెడనొప్పి ఉన్నప్పుడు స్వల్ప వ్యాయామాలు డాక్టర్ సలహా మేరకు చేయాలి
 సరైన పౌష్టికాహారాన్ని తీసుకోవాలి.

 హోమియో చికిత్సా విధానం

 హోమియోపతి వైద్యవిధానంలో సర్వైకల్ స్పాండిలోసిస్‌కి పూర్తి ఉపశమనం కలిగించే ఔషధాలు అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ విధానంలో కేవలం లక్షణాలు తగ్గించడం కాకుండా, లక్షణాలకు కారణాలను, వ్యక్తి శారీరక, మానసిక తత్వాన్ని పూర్తిగా విశ్లేషించి తగిన ఔషధాన్ని వైద్యులుసూచిస్తుంటారు. సాధారణంగా వాడే మందులు...

 బ్రయోనియా (Bryonia) : మెడ కదిలించడం వల్ల నొప్పి ఎక్కువవుతుంది. విశ్రాంతితో నొప్పి తగ్గుతుంది. వీరికి మలబద్దకంతో పాటు మెడనొప్పి వస్తుంది. దాహం అధికంగా ఉండి నీరు ఎక్కువగా తాగుతారు. ఈ లక్షణాలున్నవారికి ఈ మందు ప్రయోజనకరం.

 స్పైజీలియం: నొప్పి మెడ నుంచి మొదలై ఎడమభుజంలో ఎక్కువగా ఉంటే ఈ మందు పనిచేస్తుంది.

 కాల్మియా: కుడిభుజం వైపు నొప్పి ఎక్కువగా ఉంటే ఇది ప్రయోజనకారి.

 కోనియం: మెడనొప్పితో పాటు కళ్లు తిరిగినట్లనిపిస్తుంది. వృద్ధుల్లో వచ్చే మెడనొప్పికి ఉపయోగం. ఇవేకాకుండా హైపరికం, రాస్టాక్ మొదలైన మందులను వాటి వాటి లక్షణాల ఆధారంగా వైద్యుల సూచనమేరకు వాడితే మెడనొప్పి నుంచి శాశ్వత ఉపశమనం లభిస్తుంది.

Homoeopathy treatment for stopping Alcohol Addiction




 విత్‌డ్రావల్ సింప్టమ్స్:  చలిజ్వరం, ఒంట్లో వణుకు, గుండె వేగం పెరగడం, శ్వాసక్రియలో వేగం పెరగడం, రక్తపోటు, ఒళ్లునొప్పులు, తిమ్మిరులు, చెమటలు, ఆవలింతలు, వాంతులు, విరేచనాల వంటివి కనిపించవచ్చు. ఇలా విత్‌డ్రావల్ సింప్టమ్స్ కనిపించినప్పుడు మానసిక వైద్యుల పర్యవేక్షణలో మందులు వాడుతూ, రీహ్యాబిలిటేషన్ సెంటర్స్, ఆల్కహాల్ అనానిమస్ వంటి గ్రూపులలో చేరి ఆల్కహాల్ పూర్తిగా మానడం సాధ్యమే.

 హోమియోలో మందులు...
 ఆల్కహాల్ అలవాటు మాన్పించడానికి హోమియోలో మంచి మందులు ఉన్నాయి. అవి...

 నక్స్‌వామికా: ఆల్కహాల్ తీసుకున్న మర్నాడు తలపట్టేసినట్లు ఉండటం, తలనొప్పి, వాంతి భ్రాంతి, ఒళ్లునొప్పులు వంటి లక్షణాలు తగ్గడానికి నక్స్‌వామికా ఇచ్చి... అదే మందును తగిన పొటెన్సీలో ఇవ్వడం ద్వారా క్రమంగా ఆల్కహాల్ అలవాటును తగ్గించవచ్చు.

 ఓపియమ్: ఆల్కహాల్ తాగిన తర్వాత సమన్వయం లోపించి, తనపై తనకు అదుపు తప్పిన దశలో ఇచ్చేందుకు తగిన మందు. ఆల్కహాల్ తాగాక తనపై తాను అదుపు కోల్పోయి వాంతులు చేసుకోవడం, దెబ్బ తగిలినా నొప్పి తెలియకపోవడం, ఒళ్లు తెలియకుండా నిద్రలోకి జారిపోయే దశలో ఉండటం, నిద్రలో శ్వాసక్రియ వేగం కావడం, పెద్ద శబ్దంతో గురకపెట్టడం, పడుకున్నప్పుడు సగం కళ్లు తెరవడం, కనుపాపలు పెద్దవి (ప్యూపిల్స్ డయలేట్) కావడం వంటి లక్షణాలు ఉన్నప్పుడు ఈ మందుతో ఉపశమనం ఉంటుంది. దీనిని 30 పొటెన్సీలో రోజూ వాడటం వల్ల ఆల్కహాల్ అలవాటును క్రమ క్రమంగా తగ్గించవచ్చు.

 యాసిడ్ సల్ఫ్: ఆల్కహాల్ డిపెండెన్సీ ఉన్నవాళ్లలో సమయానికి మద్యం తాగకపోతే  దానికోసం తహతహ, చలి జ్వరం, తలనొప్పి, కాళ్లూ చేతులు వణకడం, నీళ్లు తాగితే వాంతి వచ్చినట్లుగా అనిపించడం, ఎక్కిళ్లు రావడం వంటి లక్షణాలు ఉన్నప్పుడు ఈ మందు వాడవచ్చు.

 లక్షణాలను బట్టి రానెన్‌క్యులస్ బల్బోజస్, అసారమ్‌తో పాటు మరికొన్ని మందులు ఇవ్వడం ద్వారా ఆల్కహాల్ దురలవాటును మాన్పించవచ్చు.
  
ఆల్కహాల్‌కు బానిసైపోయి, అది లేకుండా క్షణం కూడా ఉండలేని వారిని ఆల్కహాలిక్స్ అంటారు. వీళ్లలో చాలామంది దాన్ని మానివేయాలని కోరిక ఉన్నప్పటికీ కొందరు మాత్రం తమంతట తామే మానలేరు. కారణం... అకస్మాత్తుగా ఆల్కహాల్ మానేస్తే ఒంట్లో వణుకు వంటి కొన్ని ఇబ్బందులు తలెత్తవచ్చు. ఈ పరిస్థితిని డ్రగ్ డిపెండెన్సీగా పేర్కొంటారు. అకస్మాత్తుగా మద్యం మానివేయడం వల్ల కనిపించే లక్షణాలను విత్‌డ్రావల్ సింప్టమ్స్‌గా పేర్కొంటారు.

Tags - టాగ్లు: హోమియో, ఆల్కహాల్, రక్తపోటు, ఆల్కహాల్ డిపెండెన్సీ,Homoeo, Alcohol, Blood pressure, Alcohol dependency
 

Blogger news

In this blog - [ http://dls-joy.blogspot.in/ ]I am posting various articles related to Education, Science and technology, Wonders etc. In my another blog - [ http://depaspi.blogspot.in/ ]I am posting Annamayya Kritis/Keettannas in Telugu and English Translation.

Blogroll

These are the Blogs which I started as a Hobby: http://dls-joy.blogspot.in/ http://depaspi.blogspot.in/

About

These are the collections of various articles related to Education, Science, Technology, General Knowledge, Wonders etc.,from News Papers, magazines, journals and web services like youtube videos etc.