Homoeo treatment for Waist pain - బాధించే నడుమునొప్పి
డాక్టరు దగ్గరికి వెళ్ళేవారిలో ప్రతి ఇద్దరు ముగ్గురిలో ఈ బాధ బారిన పడేవారు ఒకరు తప్ప ఉంటారు. పనిచేయలేకపోవటం, విశ్రాంతి దీనికి అవసరం అవటంవలన వారు సెలవు దీనివలన తీసుకుంటారు. అధికంగా పని దినాలు దీనివలనే వృధా అవుతుంటాయి. నడుమునొప్పి వ్యాధి కాదు. వ్యాధి యొక్క లక్షణములు మాత్రమే. ఇది చాలా వ్యాధులలో సర్వ సాధారణంగా కనబడుతుంది. చిన్న జ్వరం నుండి బాధించే ప్యాసెట్ సైనొవ్యయల్ సిస్ట్ (Facet Synovial Cyst) నడుమునొప్పికి కారణాలు అనేకం. శరీరశ్రమ, పని ఒత్తిడి, మానసిక ఆందోళనలు కూడా కారణం అవుతాయి. మనం దీనిని మూడు విధాలుగా విభజించవచ్చును. సిస్టమ్ డిసీస్ Systemic Disease, స్ట్రెస్, టెన్షన్ వలన లేదా Nurological problem న్యూరోలాజికల్ ప్రాబ్లమ్ వలన.
సామాన్యంగా పది మంది నొప్పులతో బాధపడేవారిలో, ఆరుగురు నడుమునొప్పి బాధ ఉన్నవారే.
సన్నని నొప్పి, ఆగకుండా కలిగే నొప్పి, ఉప్పెన మాదిరిగా వచ్చే నొప్పి, కూర్చుంటే కలిగే నొప్పి, టూ వీలర్ నడిపితే కలిగే నొప్పి, గృహిణిలకు పనివలన కలిగే నొప్పి, పెద్దవారికి టీవీ చూస్తే నొప్పి, స్కూలు పిల్లలకు బ్యాగులు మోసి (బుక్స్) నొప్పి, కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు కూర్చునే నొప్పి, వ్యాపారులకు, ఉద్యోగులకు, రాజకీయనాయకులకు, రైతులకు పొలాలో నొప్పి, నాట్యకళాకారులకు నాట్యంలో నొప్పి, వృద్ధులకు పడుకుంటే నొప్పి, అందరినీ బాధించే నొప్పి నడుమునొప్పి.
వివిధ కారణాలు: స్వల్పకాలిక నొిప్పి: కొన్ని రోజులు, కొన్ని వారాలు ఉండే నొప్పి ముఖ్యంగా గాయాలు, వెన్నుపూసవాపు, కండరాల శ్రమ, ఆటలలో గాయాలు, అలసటతో పనిచేయడం, బరువులు ఎత్తుట... ఇటువంటి సమయాలలో నొప్పి ఆకస్మాత్తుగా తీవ్రం గా పొడిచినట్లుగా ఉంటుంది. కదలికలలో నిర్బంధం, ఫ్రీగా తిరగలేరు, కండరాలు పట్టివేసినట్లుండటం, నిటారుగా నిలబడలేరు, చక్కగాపడుకోలేరు.
దీర్ఘకాలిక నొప్పి : మూడు నెలల కంటే ఎక్కువైనచో కారణాలు వేరుగా ఉంటాయి. వివిధ రకాలుగా ఈ నొప్పి వివిధ భాగాలలో ఉంటుంది. వెన్నుపూసలో మార్పుల వలన వచ్చే నొప్పులు.
డిస్క్ (వెన్నుపూస) సమస్యలు
డిస్క్ హెర్వియేషన్
డిస్క్‌బల్జ్ (వాపు)
డిస్క్ ప్రొలాప్స్ (ప్రక్కకు జరుగుట)
నర్వ్ కంప్రెషన్ కెనాల్ నారోయింగ్
డిస్క్ లైసిస్
డిస్క్ ట్రోమ
డిస్క్ ఫ్యాక్టర్స్
డిస్క్ సిండ్రోమ్స్
స్పైనల్ టీబీ
ఆస్టియో పొరోసిస్
డిస్క్ వాపు, ఆర్ట్రైటిస్
డిస్క్ (వెన్నుపూస) వాపు, పక్కకు జరుగుట వంటివాటికి కలిగే బాధలు:
వెన్నుపూసల మధ్యన ఉండే జిగురుపదార్థం తగ్గి పక్కకు జరుగుతుంది. అపుడు నడుమునొప్పి పిరుదుల నుండి కాళ్ళ వరకు, మెడనొప్పి, భుజములు, చేతులు, తిమ్మిరి, మొద్దు బారిపోవుట, కండరాల పట్టు తగ్గుట, వణుకుట చూస్తాం.
రోగ నిర్ధారణ:
ఎక్స్-రే
ఎమ్‌ఆర్‌ఐ
సీటీ స్కాన్
వాడదగిన హోమియో మందులు
రస్టాక్స్: కండరాల, కీళ్ళ నొప్పులు, కదలికలలో నిర్బంధం (స్టిఫ్‌నెస్) చల్ల గాలి, తేమ వలన వచ్చేనొప్పి, నడుమునొప్పి, కీళ్ళ నొప్పులు.
తార్నికం: గాయాలు, బెణుకుట వలన కలిగే నొప్పి,జ్వరం, కీళ్ళ నొప్పులు, వాపు, నడకతో పెరిగే నొప్పులు.
సిమిసిపూగ: స్త్రీల సంబంధ నొప్పులు, మెన్సెస్ టైమ్‌లో పెరిగే నొప్పులు, వాతావరణ మార్పుల వలన కలిగే నొప్పులు
కాస్టకమ్: కండరాల పటుత్వం, నిర్బంధం, కీళ్ళవాపు, కండరాల క్షీణత, ఎక్కువ చలి వేడి పడదు, నడకతో పెరిగే నొప్పి.
అకొటైట్: ఉప్పెనలాంటి నొప్పులు, భయం, ఆందోళన విపరీతమైన నొప్పి, ప్రాణభయం, నరాలసంబంధ నొప్పులు.
బెల్లడొనా: కీళ్ళ వాపు, కండరాల నొప్పి, తీవ్రంగా, సడెన్‌గా వచ్చే నొప్పి, జ్వరం, కండరాలు పట్టి వేయుట, స్పాజెర్స్.
హోమియో చికిత్స
హోమియో వైద్యం ద్వారా కండరాల, కీళ్ళ, నరముల సంబంధ వ్యాధులకు స్టార్ హోమియోపతిలో నవీన చికిత్స కనుగొనబడినది. నూతన పరిశోధన ఫలితాలను అనుసరించి శారీరక, మానసిక విశ్లేషణ కారణం
రోగ లక్షణములను, మూలకారణములు వీటిని బట్టి హోమియో మందులు సూచింపబడును.
Tags - టాగ్లు: నడుము నొప్పి, ప్యాసెట్ సైనొవ్యయల్ సిస్ట్, న్యూరోలాజికల్ ప్రాబ్లమ్, Waist pain, Facet Synovial Cyst, Nurological problem
No comments:
Post a Comment