Remedy for Seasonal Allergy - వానాకాలం వచ్చింది... అలెర్జీ మొదలు
వర్షాకాలం వచ్చిందంటే ఆ వెంటనే చాలామందికి అలెర్జీ సమస్య కూడా వచ్చేస్తుంది. ఈ అలెర్జీ లక్షణాలు ఎలా ఉంటాయో ఒకసారి చూద్దాం...
- తరచూ తలనొప్పి రావడం లేదా ఒత్తిడి పెరగడం
- నరాలు బలహీనంగా ఉండటం, శారీరకంగా బలహీనంగా మారిపోవడం లేదా నిరుత్సాహంతో కొట్టుమిట్టాడుతుండటం.
- ఆస్తమా
- ముక్కు దిబ్బడ, తరచూ జలుబుతో బాధపడుతుండటం
- తరచూ ముఖం, కళ్ళు వాచిపోతుండటం.
అలర్జీకి ప్రకౄఎతిపరమైన చికిత్స - తరచూ ఆహారంగా చాక్లెట్లు, చల్లటి ద్రవపదార్థాలు, మద్యపానం, చక్కెర, చికెన్, ధూమపానం, పాలు, మజ్జిగ తీసుకోకూడదు.
- అలర్జీగా ఉన్నప్పుడు 125 మిల్లీ గ్రాముల విటమిన్ బీ5 మాత్రలు వాడండి. లేదా పాంటోథెనిక్ యాసిడ్‌ను ప్రతి రోజు వాడాలి. ఇలా రెండు- మూడు నెలలు వాడితే అలర్జీ నుంచి ఉపశమనం కలుగుతుందంటున్నారు ఆరోగ్య నిపుణులు.
- విటమిన్ ఈ 300 మిల్లీ గ్రాముల బిళ్ళలు ఆరు వారాలపాటు వాడాలి. ఇది శరీరంలోని అలర్జీని పార్రదోలేందుకు చాలా దోహదపడుతుందంటున్నారు వైద్యులు.
- అలర్జీని పార్రదోలే అత్యంత దివ్యమైన ఔషధం మంచినీరు. ప్రతి రోజు ఎనిమిది గ్లాసుల నీటిని తాగుతుంటే ఆ నీరు శరీరంలోని మ్యూకస్‌ను బయటకు తరిమేస్తుంది. దీంతో అలర్జీ నుంచి ఉపశమనం కలుగుతుంది.
- ఇంట్లో ఉన్నప్పుడు లేదా వాహనాలలో ప్రయాణించేటప్పుడు కిటికీలు మూసివుంచండి. దీంతో దుమ్ము ధూళి నుంచి మీరు బయటపడగలరు. అలాగే దుమ్ము, ధూళి బారిన పడకుండా ఉంటే అలర్జీ రాదంటున్నారు వైద్యులు.
మూలికలతో చికిత్స
జలుబు, ముక్కు దిబ్బడగా ఉన్నప్పుడు జీలకర్ర, సోంపు, నువ్వులు, చెరి 50 గ్రాములు కలుపుకుని వేయించుకోవాలి. ఈ మిశ్రమంలో ఒక చెంచా నల్ల ఉప్పు కలుపుకోవాలి. దీనిని ఓ గాజు సీసాలో భద్రపరచుకోండి. ప్రతిరోజు భోజనం తీసుకున్న తర్వాత పైన చెప్పబడిన మిశ్రమంలోంచి అరచెంచా సేవించండి. దీంతో శరీరంలో ఎటువంటి అలర్జీ నైనా ఈ మిశ్రమం తొలగిస్తుందంటున్నారు వైద్యులు.
No comments:
Post a Comment