Are You 30+. . .Appear as Sweet 20
మీకు 30 ప్లసా... స్వీట్ 20లా కనిపించాలంటే...
మీకు 30 ప్లసా... స్వీట్ 20లా కనిపించాలంటే...
మీకు 30 ప్లసా... కానీ స్వీట్ 20లా కనిపించాలానుకుంటున్నారా? అయితే ఈ చిట్కాలు పాటించండి. ఎప్పటికీ యంగ్‌గా కనిపించాలనుకుంటే ముందు శారీరకంగానే కాకుండా మానసికంగానూ ఫిట్‌గా ఉండాలి. శరీరానికే కాకుండా.. మనస్సుకు కూడా విశ్రాంతి అవసరం. అప్పుడే 40 ఏళ్ల వయస్సుల్లోనూ మీరు స్వీట్ 20లా కనిపిస్తారు.
- ఇంకా మీరు యవ్వనంగా కనిపించాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలంటే.. ఉడికించిన ఆహారం కంటే, పండ్లు, కాయగూరల్ని సలాడ్ల రూపంలో తీసుకోవచ్చు. ఇలా తీసుకుంటే పండ్లు, కూరగాయల్లోని పోషకాలు మీకు పుష్కలంగా లభిస్తాయి. వంటకు కొవ్వు శాతం లేని ఆలివ్ ఆయిల్‌ను ఉపయోగించండి. అలాగే చర్మం, కేశాలను సంరక్షించుకోవడం కోసం సన్ స్క్రీన్ మరియు హెయిర్ కండిషనర్లను ఉపయోగించండి
- బాగా నిద్రపోండి. వ్యాయామం చేయండి. మీ చర్మ సంరక్షణ కోసం లోషన్లు వాడండి. మేకప్ ఎక్కువగా వేయటాన్ని చాలామటుకు తగ్గించండి. ఎప్పుడూ సంతోషంగా నవ్వుతూ ఉండండి. మనస్సును ఏవేవో ఆలోచనలతో శ్రమ పెట్టకండి. రాతప్రూట త్వరగా నిద్రకు ఉపక్రమించి తెల్లవారుజామున లేవండి. ధ్యానం చేయండి. ఇతరుల వద్ద మనస్సు విప్పి మాట్లాడండి. ఇవన్నీ చేస్తే 40 ఏళ్లైనా 20గానే కనిపిస్తారు.
No comments:
Post a Comment