విత్‌డ్రావల్ సింప్టమ్స్: చలిజ్వరం, ఒంట్లో వణుకు, గుండె వేగం పెరగడం, శ్వాసక్రియలో వేగం పెరగడం, రక్తపోటు, ఒళ్లునొప్పులు, తిమ్మిరులు, చెమటలు, ఆవలింతలు, వాంతులు, విరేచనాల వంటివి కనిపించవచ్చు. ఇలా విత్‌డ్రావల్ సింప్టమ్స్ కనిపించినప్పుడు మానసిక వైద్యుల పర్యవేక్షణలో మందులు వాడుతూ, రీహ్యాబిలిటేషన్ సెంటర్స్, ఆల్కహాల్ అనానిమస్ వంటి గ్రూపులలో చేరి ఆల్కహాల్ పూర్తిగా మానడం సాధ్యమే.
హోమియోలో మందులు...
ఆల్కహాల్ అలవాటు మాన్పించడానికి హోమియోలో మంచి మందులు ఉన్నాయి. అవి...
నక్స్‌వామికా: ఆల్కహాల్ తీసుకున్న మర్నాడు తలపట్టేసినట్లు ఉండటం, తలనొప్పి, వాంతి భ్రాంతి, ఒళ్లునొప్పులు వంటి లక్షణాలు తగ్గడానికి నక్స్‌వామికా ఇచ్చి... అదే మందును తగిన పొటెన్సీలో ఇవ్వడం ద్వారా క్రమంగా ఆల్కహాల్ అలవాటును తగ్గించవచ్చు.
ఓపియమ్: ఆల్కహాల్ తాగిన తర్వాత సమన్వయం లోపించి, తనపై తనకు అదుపు తప్పిన దశలో ఇచ్చేందుకు తగిన మందు. ఆల్కహాల్ తాగాక తనపై తాను అదుపు కోల్పోయి వాంతులు చేసుకోవడం, దెబ్బ తగిలినా నొప్పి తెలియకపోవడం, ఒళ్లు తెలియకుండా నిద్రలోకి జారిపోయే దశలో ఉండటం, నిద్రలో శ్వాసక్రియ వేగం కావడం, పెద్ద శబ్దంతో గురకపెట్టడం, పడుకున్నప్పుడు సగం కళ్లు తెరవడం, కనుపాపలు పెద్దవి (ప్యూపిల్స్ డయలేట్) కావడం వంటి లక్షణాలు ఉన్నప్పుడు ఈ మందుతో ఉపశమనం ఉంటుంది. దీనిని 30 పొటెన్సీలో రోజూ వాడటం వల్ల ఆల్కహాల్ అలవాటును క్రమ క్రమంగా తగ్గించవచ్చు.
యాసిడ్ సల్ఫ్: ఆల్కహాల్ డిపెండెన్సీ ఉన్నవాళ్లలో సమయానికి మద్యం తాగకపోతే దానికోసం తహతహ, చలి జ్వరం, తలనొప్పి, కాళ్లూ చేతులు వణకడం, నీళ్లు తాగితే వాంతి వచ్చినట్లుగా అనిపించడం, ఎక్కిళ్లు రావడం వంటి లక్షణాలు ఉన్నప్పుడు ఈ మందు వాడవచ్చు.
లక్షణాలను బట్టి రానెన్‌క్యులస్ బల్బోజస్, అసారమ్‌తో పాటు మరికొన్ని మందులు ఇవ్వడం ద్వారా ఆల్కహాల్ దురలవాటును మాన్పించవచ్చు.
ఆల్కహాల్‌కు బానిసైపోయి, అది లేకుండా క్షణం కూడా ఉండలేని వారిని ఆల్కహాలిక్స్ అంటారు. వీళ్లలో చాలామంది దాన్ని మానివేయాలని కోరిక ఉన్నప్పటికీ కొందరు మాత్రం తమంతట తామే మానలేరు. కారణం... అకస్మాత్తుగా ఆల్కహాల్ మానేస్తే ఒంట్లో వణుకు వంటి కొన్ని ఇబ్బందులు తలెత్తవచ్చు. ఈ పరిస్థితిని డ్రగ్ డిపెండెన్సీగా పేర్కొంటారు. అకస్మాత్తుగా మద్యం మానివేయడం వల్ల కనిపించే లక్షణాలను విత్‌డ్రావల్ సింప్టమ్స్‌గా పేర్కొంటారు.
Tags - టాగ్లు: హోమియో, ఆల్కహాల్, రక్తపోటు, ఆల్కహాల్ డిపెండెన్సీ,Homoeo, Alcohol, Blood pressure, Alcohol dependency
No comments:
Post a Comment