వెలి కొసలలో మెరుపులు... గోళ్ల రింగులు (Nail Rings)!
వాటిని తమ మునివేళ్లకు తగిలించుకుని ముదితలు ముచ్చటపడుతున్నారు. ఇప్పటి వరకు వేళ్లకే ఉన్న ఉంగరాలు కాస్తా ఇంకాస్త ముందుకు జరిగి గోళ్లపై హొయలుపోతున్నాయి. ప్రాచీన చైనాలో గోళ్ల సంరక్షణలో భాగంగా ఈ రింగ్ ట్రెండ్ మొదలైంది. గోళ్ల మీద నక్షత్రాలు, కీ చెయిన్‌లను పోలి ఉండే డిజైన్లు మొదట వచ్చాయి.
ఇటీవలి కాలంలో వీటిలో ఎన్నో విభిన్న డిజైన్లు వెలుగు చూస్తున్నాయి. బంగారం, వెండి, స్టీల్‌తో తయారయ్యే ఈ నెయిల్ రింగ్స్‌లో స్వరోస్కి క్రిస్టల్స్ పొదగడంతో మరింత మెరుపులీనుతున్నాయి. స్టైలిష్ యాక్ససరీస్‌లో ‘ఎండ్’ అనేది లేదని నిరూపిస్తున్న ఈ తరహా రింగ్స్ మగువలను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఆన్‌లైన్‌లోనూ లభిస్తున్న వీటి ధరలు రూ. 200 నుంచి వేల రూపాయల్లో ఉన్నాయి.
టాగ్లు: గోళ్లు, అందం, మెరుపులు, డిజైన్లు, రింగ్, Nails, beauty, lightning, designs, ring
No comments:
Post a Comment