Hair Care - శిరోజాల సంరక్షణ
నిమ్మ: శరీర సంరక్షణలో నిమ్మరసం మేలైనది. ఎక్కువ ఖర్చు లేకుండానే చాలా రకాలుగా ఉపయోగించుకోవచ్చు. బయటకు వెళ్లేముందు నిమ్మరసాన్ని కొద్దిగా నీళ్లలో కలిపి, జుట్టుకు స్ప్రే చేయాలి. దీంతో సూర్యకాంతి నేరుగా శిరోజాలకు తగిలి, దెబ్బతినకుండా ఉంటాయి. తలస్నానం చేయడానికి ముందు నిమ్మరసాన్ని మాడుకు పట్టించి, రుద్దితే చుండ్రు సమస్య తగ్గుతుంది. జుట్టు ఎక్కువ జిడ్డుగా ఉంటే, నిమ్మరసం కలిపిన నీటిని తలను శుభ్రపరచడానికి వాడాలి.
బొప్పాయి: బొప్పాయి గుజ్జు సహజసిద్ధమైన హెయిర్ ప్యాక్ అని చెప్పుకోవచ్చు. తలలోని దుమ్ము, జిడ్డును పోగొట్టడమే కాదు రసాయనాల గాఢతను తొలగిస్తుంది. బొప్పాయిలో ఉండే ఎ, సి విటమిన్లు పొటాషియమ్, మెగ్నిషయం గుణాల వల్ల వెంట్రుకలు నిగనిగలాడుతాయి. పావుకప్పు బొప్పాయి గుజ్జును తలకు పట్టించి, అరగంట తర్వాత నీటితో శుభ్రపరచండి. జుట్టుకు ఈ మాస్క్ మంచి కండిషనర్‌లా ఉపయోగపడుతుంది. చర్మ నిగారింపులోనూ బొప్పాయి మహత్తరంగా పనిచేస్తుంది.
అవకాడో: ఈ పండ్ల గుజ్జు క్రీమీగా ఉంటుంది. దీంట్లో ఉండే ఫ్యాటీ యాసిడ్స్ చర్మానికి మాయిశ్చరైజర్‌లా పనిచేస్తాయి. బొప్పాయి లాగానే అవకాడో గుజ్జును మెత్తగా రుబ్బి, జుట్టుకు ప్యాక్ వేసుకోవాలి. అరగంట తర్వాత శుభ్రపరుచుకోవాలి. పెలుసుగా మారి జీవం కోల్పోయిన జుట్టుకు ఈ ప్యాక్ ఇన్‌స్టంట్ మాయిశ్చరైజర్‌లా పనిచేస్తుంది.
TAGS (టాగ్లు) :
శిరోజాల సంరక్షణ, సూర్యకాంతి, హెయిర్ ప్యాక్, Hair care, sunlight, Hair Pack
No comments:
Post a Comment