If You dont Breakfast - అల్పాహారం తీసుకోకపోతే...
బతకాలి కాబట్టి, ఏదో కాస్త తినేసి పనిచేసుకుంటూ ఉన్నారు. ఇలాంటి వారు సరైన పోషకాహారం తీసుకోని కారణంగా అనారోగ్యం బారిన పడుతుంటారు. ఇలాంటి వారు ‘ఏదో తినాలి కాబట్టి తింటున్నాం’ అనుకోకుండా చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ ఆహారం తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉండగలుగుతారు.
- రోజూ ఉదయాన్నే టిఫిన్ చేయడం కొందరికి అలవాటు ఉండదు. ఇది మంచిదికాదు. ఉదయం అల్పాహారం తీసుకోకుండా పనిచేయడం వల్ల పనిలో ఒత్తిడిని తట్టుకునే శక్తి తగ్గుతుంది. పైగా జీర్ణవ్యవస్థకు సంబంధించి కూడా ఈ అలవాటు మంచిదికాదు.
- అల్పాహారం తీసుకోకపోవడం వల్ల రక్తంలో షుగర్ లెవెల్స్ తేడాలు వచ్చి సమస్య ఏర్పడే అవకాశం ఉంది. అలాగే రిలీఫ్ కోసం ఒకటి, రెండుసార్లు కాఫీ, టీలను సేవించిడం ఫరవాలేదు. అలాకాకుండా అతిగా తీసుకోవడం కూడా మంచిదికాదు.
ఎప్పుడంటే అప్పుడు చిరుతిళ్లు తింటూ ఉండకూడదు. మాంసాహారాన్ని కూడా తరచూ తీసుకోకుండా వారానికి ఒకటి లేదా రెండుసార్లు తీసుకోవడం మంచిది. రోజూ భోజనంలో కచ్చితంగా ఆకుకూరలు, కూరగాయలు ఉండేలా చూసుకోవాలి. - వంటల్లో ఉప్పు, కారం, నూనెలను తక్కువ మోతాదులో ఉండేలా చూసుకోవాలి. రోజూ తగుమాత్రం నీటిని తీసుకోవాలి. ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలను పాటిస్తే చక్కటి ఆరోగ్యం మీ సొంతం అవుతుంది.
No comments:
Post a Comment