Pages

What do you know about India

మన దేశం గురించి మీకేం తెలుసు?

మన దేశం గురించి మీకేం తెలుసు?
దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. శుక్రవారం 68వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఆనందోత్సాహాలతో జరుపుకొంటున్నాం. అయితే.. అసలు మన దేశం గురించిన విషయాలు మీకు ఎంతవరకు తెలుసు? ఏవేం తెలుసు? ఈ విషయాలు తెలుసుకోవాలంటే ఈ సందర్భంగా ఒక చిన్న పరీక్షపెట్టుకుందామా.. పదండి మరి.

1) జాతీయ పతాకాన్ని రూపొందించింది ఎవరు?

2) మన జాతీయ చిహ్నం ఏమిటి? దాన్ని ఎంపిక చేసింది ఎవరు?

3) మన జాతీయ చిహ్నం మీద ఎన్ని జంతువులు ఉంటాయి?

4) మన జాతీయ నది ఏది? అది ఎప్పటినుంచి అమలులోకి వచ్చింది?

5) భారతదేశం నా మాతృభూమి.. అనే ప్రతిజ్ఞను రాసినవారు ఎవరు?

6) మన జాతీయ మృగం ఏది, జాతీయ నీటి జంతువు, జాతీయ పక్షి ఏవి?

7) మన జాతీయ గేయం ఏది.. జాతీయ గీతం ఏది?

8) మన జాతీయ క్రీడ ఏది?

సమాధానాలు ఇక్కడ చూడండి:
మన దేశం గురించిన ప్రశ్నలకు సమాధానాలు ఇవీ..

1. కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగులలో, తెలుపు రంగులో మధ్యగా 24 ఆకుల నీలిరంగు ధర్మచక్రంతో (అశోక చక్రం) భారత జాతీయ పతాకాన్ని రూపొందించుకున్నాం. దీనిని తెలుగువాడైన పింగళి వెంకయ్య రూపొందించారు.

2. బోర్లించినట్టు ఉండే కమలం మీద నిర్మించిన నాలుగు సింహాల శిల్పంలో కింద మకలం భాగాన్ని వదిలేసి, మిగిలిన భాగాన్ని జాతీయ చిహ్నంగా స్వీకరించారు. దాని కింద ‘సత్యమేవ జయతే’ (సత్యమే జయిస్తుంది) అని దేవనాగర లిపిలో రాయించారు. మాధవ్ సాహ్ని దీనిని జాతీయ చిహ్నంగా ఎంపిక చేశారు.

3. మొత్తం నాలుగు రకాల జంతువులు మన జాతీయ చిహ్నం మీద కనిపిస్తాయి. పైన కనిపించే నాలుగు సింహాలు ఆసియాటిక్ లయన్స్. ఈ నాలుగు సింహం తలలు నాలుగు గుణాలకు ప్రతీకలు. అవి- శక్తి, గౌరవం, ధైర్యం, విశ్వాసం. ఇంకా, మన ధర్మచక్రం మీద బలిష్టమైన ఎద్దు, పరుగులు తీస్తున్న గుర్రం, ఏనుగు, సింహం బొమ్మలు ఉంటాయి. ఇవి నాలుగు దిక్కులను చూస్తున్నట్లు ఉంటాయి. జనవరి 26, 1950న దీనిని జాతీయ చిహ్నంగా భారతదేశం అలంకరించుకుంది.

4. మన జాతీయ నది గంగానది. దీన్ని నవంబర్ 5, 2008న జాతీయ నదిగా ప్రకటించారు.

5. ‘భారతదేశము నా మాతృభూమి.. భారతీయులంతా నా సహోదరులు..’ అంటూ సాగే ప్రతిజ్ఞను తొలిసారి 1963లో విశాఖపట్నంలోని ఒక పాఠశాలలో పిల్లల చేత చదివించారు. దీనిని రచించిన వారు పైడిమర్రి వెంకట సుబ్బారావు. నల్లగొండ జిల్లా అన్నేపర్తికి చెందిన వెంకట సుబ్బారావు బహుభాషావేత్త. విశాఖపట్నం ట్రెజరీ అధికారిగా ఉన్నపుడు 1962లో ఈ ప్రతిజ్ఞ తయారుచేశారు. జనవరి 26, 1965 నుంచి దీనిని దేశమంతా చదువుతున్నారు.

6. బెంగాల్ టైగర్ మన జాతీయ మృగం. ఇది శక్తి సామర్థ్యాలకు ప్రతీక. గంగానదిలో కనిపించే మంచినీటి డాల్ఫిన్‌ను జాతీయ నీటి జంతువుగా పేర్కొంటారు. 1963లో నెమలి భారతీయుల జాతీయ పక్షి అయింది.

7. బంకించంద్ర ఛటర్జీ రాసిన వందేమాతరమ్ మన జాతీయ గేయం. ఇది చాలా పెద్దది కావడంతో మొదటి రెండు చరణాలను 1950లో భారత ప్రభుత్వం జాతీయ గేయం (సాంగ్)గా స్వీకరించింది. ఇక సాహిత్య నోబెల్ అందుకున్న ఏకైక భారతీయుడు రవీంద్రనాథ్ టాగూర్ రాసిన గీతం జనగణమన. 1919లో  టాగూర్ తెలుగు ప్రాంతంలోని మదనపల్లెకు (చిత్తూరు జిల్లా) రావడంతో ఆ గీతానికి బాణీ కట్టే సందర్భం వచ్చింది. 52 సెకన్లు పాడుకునే ఈ గీతాన్నే జనవరి 24, 1950లో జాతీయ గీతంగా మన ప్రభుత్వం ప్రకటించింది.  

8. మన జాతీయ క్రీడ.. హాకీ కాదు. అసలు మనకు జాతీయ క్రీడ అంటూ ఏదీ లేదు.

Courtesy: Dr. Goparaju Narayana Rao

టాగ్లు: independence dayour countryquizస్వాతంత్ర్య దినోత్సవంమన దేశంక్విజ్

No comments:

Post a Comment

 

Blogger news

In this blog - [ http://dls-joy.blogspot.in/ ]I am posting various articles related to Education, Science and technology, Wonders etc. In my another blog - [ http://depaspi.blogspot.in/ ]I am posting Annamayya Kritis/Keettannas in Telugu and English Translation.

Blogroll

These are the Blogs which I started as a Hobby: http://dls-joy.blogspot.in/ http://depaspi.blogspot.in/

About

These are the collections of various articles related to Education, Science, Technology, General Knowledge, Wonders etc.,from News Papers, magazines, journals and web services like youtube videos etc.