Wim Hof Ice Man - మిస్టర్ మంచు మనిషి!
రక్తం గడ్ట కట్టే అతి శీతల వాతావరణంలో కూడా అతడు అపూర్వ విన్యాసాలు చేయగలడు. అందుకే హాలండ్‌కు చెందిన విమ్ హాప్‌ను ‘ఐస్‌మ్యాన్’ అని పిలుస్తారు. అత్యధిక సమయం పాటు ఐస్‌బాత్‌తో సహా మొత్తం 20 గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌లను బ్రేక్ చేసిన ఘనత ఆయనకు దక్కింది.
మంచుముక్కలపై 52 నినిషాల 42 సెకండ్ల పాటు అతను కదలకుండా నిలుచున్నాడు. అలాగే, సబ్-జీరో టెంపరేచర్‌లో ధ్యానం చేశాడు. కేవలం ఒక జత బట్టలతో ఎవరెస్ట్ అధిరోహించడం ద్వారా ఛాలెంజింగ్ రికార్డ్‌ను సృష్టించాడు. ‘‘మంచుగడ్డలకు నేను ఎప్పుడూ భయపడలేదు. నా శరీరం ఎక్కడ తట్టుకోగలదు. ఎక్కడ తట్టుకోలేదు అనే విషయంపై నాకు స్పష్టమైన అవగాహన ఉంది’’ అంటున్నాడు హాప్.
‘‘వేడిగా ఉండండి... అంటూ నా మెదడు శరీరంలోని ఇతర బాగాలకు సందేశాలను పంపగలదు’’ అని సరదాగా అంటాడు హాప్. సరదా సంగతి ఎలా ఉన్నా మంచుకొండల్లో ఆయన విన్యానాలు చూస్తే...‘అయ్య బాబోయ్’ అనిపించక మానదు.
Read More....
The Ice Man Wim Hof - మిస్టర్ మంచు మనిషి!
TAGS (టాగ్లు) : 20 గిన్నిస్ బుక్, రికార్డులు, విన్యాసాలు, శీతల వాతావరణం, సబ్-జీరో టెంపరేచర్, 20 Guinness Book, Records, Acrobatics, Cold weather, Sub - Zero Temperature
No comments:
Post a Comment