Pearl Facial - ముత్యాల ఫేసియల్...
పెర్ల్ ఫేసియల్: ముత్యాల పొడిని ఈ తరహా ఉత్పత్తిలో ఉపయోగిస్తారు.
ముత్యాల పొడిలో ఉండే సుగుణాలు చర్మం పైభాగంలో ఉండే మెలనిన్‌ను ప్రభావితం చేస్తాయి. ఫలితంగా ఎండ వల్ల దెబ్బతిన్న చర్మం (ట్యాన్) సాధారణ స్థితికి వస్తుంది. అంతేకాదు ముత్యాలలో బలమైన పోషకాలు, అమినో యాసిడ్స్, మినరల్స్, ప్రొటీన్లు ఉండి చర్మకణాలను శక్తిమంతం చేస్తాయి. ఫలితంగా చర్మగ్రంథులు చురుగ్గా పనిచేస్తాయి. అందుకే ముత్యాల పొడిని సౌందర్య ఉత్పాదనలలో ఉపయోగిస్తుంటారు. ముత్యాల ఫేసియల్ జిడ్డు చర్మం గలవారికి మంచి ఫలితాన్ని ఇస్తుంది.
నోట్: ఫేసియల్‌కు ఏ ఉత్పత్తులను వాడుతున్నారో నిపుణులను డిమాండ్ చేయవచ్చు. ఎందుకంటే నాణ్యమైన ఉత్పత్తులు వాడితేనే తీరైన ఫలితం.
No comments:
Post a Comment