Sonia is richer than Elizabeth
ఎలిజబెత్ కన్నా సోనియా ధనవంతురాలు
December 02, 2013 17:37 (IST)
50 బిలియన్ల ఆస్తితో జాబితాలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin) అగ్రస్థానంలో ఉన్నారు. ఆ తర్వాత స్థానాల్లో థాయ్‌లాండ్ రాజు భుమిబోల్ అదుల్యాదెజ్, బ్రూనై సుల్తాన్ హసనల్ ఉన్నారు. బ్రిటన్ రాణి ఎలిజబెత్ ఆస్తి ఐదొందల మిలియన్ డాలర్లు మాత్రమే. 2009లో సోనియా సమర్పించిన ఎన్నికల అఫిడవిట్‌లో తనకు 1.38 కోట్ల రూపాయల ఆస్తి ఉన్నట్లుగా తెలిపారు. అయితే ఆమెకు సొంత వాహనం కానీ, సొంత ఇల్లు కానీ లేదని వెల్లడించారు. 75 వేల నగదు, బ్యాంక్ డిపాజిట్ల రూపంలో 28 లక్షలా 61 వేల రూపాయలున్నాయని ప్రకటించారు.
Tags - టాగ్లు: సోనియా గాంధీ, ఎలిజబెత్, హఫింగ్‌టన్ పోస్ట్, sonia gandhi, Queen Elizabeth, Huffington Post
No comments:
Post a Comment