Fortune Top 10 Most Powerful Indian Business Women - చందా కొచర్ నంబర్ వన్
భారత వ్యాపార రంగంలో శక్తిమంతమైన మహిళల జాబితాలో ఐసీఐసీఐ
బ్యాంక్ ఎండీ, సీఈవో చందా కొచర్ వరుసగా మూడోసారి అగ్రస్థానం
దక్కించుకున్నారు. యాక్సిస్ బ్యాంక్ ఎండీ శిఖా శర్మ, క్యాప్‌జెమిని ఇండియా
సీఈవో అరుణ జయంతి త ర్వాత స్థానాల్లో నిల్చారు. 2013 సంవత్సరానికి
సంబంధించి ఫార్చూన్ మ్యాగజైన్ రూపొందించిన ఈ జాబితాలో అపోలో హాస్పిటల్
ఎంటర్‌ప్రైజెస్ ఎండీ ప్రీతా రెడ్డి నాలుగో స్థానంలోను, ట్రాక్టర్స్ అండ్
ఫార్మ్ ఎక్విప్‌మెంట్ (టాఫే) సీఈవో మల్లికా శ్రీనివాసన్ అయిదో స్థానంలోనూ
ఉన్నారు. వ్యాపార రంగంలో రాణిస్తున్న 50 మంది మహిళలతో ఫార్చూన్ ఈ జాబితాను
రూపొందించింది. ఇందులో ఈసారి కొత్తగా ఆరుగురికి చోటు దక్కింది. వీరిలో
హెరిటేజ్ ఫుడ్స్ వైస్ చైర్మన్, ఎండీ నారా భువనేశ్వరి కూడా ఉన్నారు. బహుళ
జాతి ఇంధన సంస్థ మొదలుకుని ప్రపంచంలోనే అతి పెద్ద కాఫీ చెయిన్ దాకా పలు
దిగ్గజాల భారత కార్యకలాపాల నిర్వహణలో మహిళలు మరింత ప్రముఖంగా
కనిపిస్తున్నారని ఫార్చూన్ మ్యాగజైన్ వ్యాఖ్యానించింది.
ఈ జాబితాలోని టాప్ టెన్‌లో హెచ్‌టీ మీడియా చైర్‌పర్సన్ శోభన భర్తియా,
బయోకాన్ సీఎండీ కిరణ్ మజుందార్ షా, ఏజెడ్‌బీ పార్ట్‌నర్స్
సహవ్యవస్థాపకురాలు జియా మోడీ, బ్రిటానియా ఎండీ వినీత బాలి, హెచ్‌ఎస్‌బీసీ
ఇండియా కంట్రీ హెడ్ నైనా లాల్ కిద్వాయ్ ఉన్నారు.
ఫార్చూన్ టాప్-10 (Fortune Top 10 )
చందా కొచర్ (ఐసీఐసీఐ బ్యాంక్)
శిఖా శర్మ (యాక్సిస్ బ్యాంక్)
అరుణ జయంతి (క్యాప్ జెమిని)
ప్రీతా రెడ్డి (అపోలో హాస్పిటల్స్)
మల్లికా శ్రీనివాసన్ (టాఫే)
శోభనా భర్తియా (హెచ్‌టీ మీడియా)
కిరణ్ మజుందార్ షా (బయోకాన్)
జియా మోడీ (ఏజడ్‌బీ)
వినీతా బాలి (బ్రిటానియా)
నైనాలాల్ కిద్వాయ్ (హెచ్‌ఎస్‌బీసీ)
Tags:Most,Powerful,business,women,India,Fortune,Top 10,ICICI,Axis,Cap Gemini,Apollo Hospitals,Taffe,HT media,Biocon,AZB,Britannia,HSBC
No comments:
Post a Comment